Prabhas: ‘ఆర్.ఆర్.ఆర్’ లో ఆ 10 సీన్లు ఏడిపించేసాయి: ప్రభాస్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటికీ అదిరిపోయే కలెక్షన్లు నమోదు చేస్తూ రికార్డులు సృష్టిస్తుంది. ఈ మూవీలో రాంచరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించి అలరించారు.మార్చి 25న రిలీజైన ఈ పాన్‌ ఇండియా మూవీ ఇప్పటివరకు ఏకంగా రూ.1060 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్ళను సాధించింది. ఈ సినిమా పై సెలబ్రిటీలంతా పొగడ్తల వర్షం కురిపించారు.

Click Here To Watch NOW

బాలీవుడ్ లో కొంతమంది అయితే కడుపుమంటతో ట్వీట్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం పై తాజాగా పాన్‌ ఇండియా స్టార్‌ అలాగే బాహుబలి(సిరీస్) హీరో అయిన ప్రభాస్‌ స్పందించాడు. ఆయన సినిమాని కాస్త ఆలస్యంగా చూసినట్టున్నాడు. రాజమౌళి చెప్పినట్టే ప్రభాస్ ప్రీమియర్ షోకి పిలిస్తే రావడమే అంటూ చేసిన కామెంట్లని నిజం చేసాడనే చెప్పాలి. ఇక ఈ చిత్రం పై ప్రభాస్ స్పందిస్తూ.. ‘నేను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ రీసెంట్ గా చూసాను. చాలా బాగా నచ్చింది.

దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన కొద్ది చిత్రాల్లో ఇది కూడా ఒకటి. ఆల్రెడీ రూ.1100 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఈ మూవీ గొప్ప అనుభూతిని మిగిల్చింది. ఆల్మోస్ట్ 10 సీన్స్ లో నాకు కన్నీళ్లు వచ్చేసాయి.మొత్తంగా 50 సీన్లు నన్ను కట్టిపడేశాయి. మూవీ చాలా చాలా బాగుంది’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసాడు ప్రభాస్. అయితే ఈ పాన్ ఇండియా స్టార్ కు కన్నీళ్ళు తెప్పించిన సీన్ కచ్చితంగా కొమరం భీముడొ పాట, అలాగే ఇంటర్వెల్ సీన్స్ అయ్యుండొచ్చని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus