అనుష్కకు సూపర్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్!

సినిమాల్లో ప్రభాస్, అనుష్క మధ్య కెమిస్ట్రీ నిజమైన ప్రేమికుల్ని గుర్తు చేస్తుంది. అందుకే వారిద్దరూ కలిసి నటించాలని అభిమానులే కాదు.. నిర్మాతలు కోరుకుంటున్నారు. కానీ ఇప్పటికే ప్రభాస్, అనుష్క లపై బోలెడన్ని గాసిప్స్ వచ్చేసాయి. బిల్లా.. మిర్చి.. మాత్రమే కాదు.. బాహుబలి సినిమాలు విజయం సాధించడంతో.. ప్రభాస్, అనుష్క బయట కనిపిస్తే చాలు.. అదే బ్రేకింగ్ న్యూస్ అయిపోతోంది. అందుకే కలిసి నటించడమే కాదు.. కలిసి బయటికి కనిపించడం మానేశారు. అయితే వారి మధ్య అనుబంధాన్ని మాత్రం వదులుకోలేదు. ప్రభాస్ బర్త్‌డే కి అనుష్క అందమైన వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చింది. తాజాగా ఈ నెల 7న అనుష్క తన బర్త్‌డేను జరుపుకుంది.

ఈ సందర్భంగా ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా అనుష్క టైటిల్ రోల్ పోషించిన భాగమతి మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ గురించి కామెంట్ పెట్టి.. పనిలో పనిగా  పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పేశారు. అయితే ఆరోజు ప్రత్యేకంగా ఆమెకు ఫోన్ చేసి విషెష్ చెప్పినట్లు తెలిసింది. అంతేకాదు అనుష్కకు ప్రభాస్ బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్‌గా ఇచ్చారని సమాచారం. ఇంత కాస్ట్లీ కార్ గిఫ్ట్ గా ఇవ్వడంతో ఈ విషయమే ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus