Prabhas: చిన్న మ్యూజిక్ డైరెక్టర్లకే ఛాన్స్ ఇస్తున్న ప్రభాస్.. మ్యాటర్ ఏంటి?

సాధారణంగా ఓ భారీ హిట్ కొట్టిన తర్వాత హీరో రేంజ్ మారుతుంది. పారితోషికం పెరగడంతో పాటు అతని సినిమాకి పెట్టుబడులు పెట్టడానికి బయ్యర్లు కూడా ఎగబడుతుంటారు. వీటిని దృష్టిలో పెట్టుకుని హీరోలు కూడా తమ సినిమాకి స్టార్ టెక్నీషియన్ లు కావాలని కోరుకుంటూ ఉంటారు.దర్శకుడు దగ్గర నుండీ ఫైట్ మాస్టర్, మ్యూజిక్ డైరెక్టర్ లు ఇలా అన్ని విషయాల్లోనూ పేరుగాంచిన టెక్నీషియన్ లు అయితేనే బాగుంటుంది అని వారు భావిస్తూ ఉంటారు.

అయితే ఈ విషయంలో ప్రభాస్ పద్ధతి పూర్తిగా వేరుగా ఉంది. అతను ఇప్పుడు ఇండియన్ వైడ్ సూపర్ స్టార్. అతనితో సినిమాలు చేయడానికి పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఒకటి రెండు సినిమాలు తీసి హిట్లు కొట్టిన వాళ్ళకే అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు. డైరెక్టర్ల విషయం పక్కన పెడితే మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో కూడా అదే పద్దతిని ఫాలో అవుతుండడం ఆశ్చర్యం కలిగించే విషయం. ‘రాధేశ్యామ్’ చిత్రానికి ‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు.

హిందీ వెర్షన్ కు మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేస్తున్నారు.ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్న ‘సలార్’ కు ‘కె.జి.ఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కి మిక్కీ.జె.మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఓం రౌత్ డైరెక్షన్ లో చేస్తున్న ‘ఆదిపురుష్’ కు సాచెత్ – పరంపర అనే యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేయబోతున్నారు. ‘సాహో’ లో సూపర్ హిట్ అయిన ‘సైకో సైయా’ పాటకు మ్యూజిక్ కంపోజ్ చేసింది వీళ్ళే. ఇలా చిన్న చిన్న మ్యూజిక్ డైరెక్టర్లతోనే వర్క్ చేయడానికి ప్రభాస్ ఇంట్రెస్ట్ చూపించడం వెనుక కారణం ఏంటనేది అంతుచిక్కని ప్రశ్న..!

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus