Prabhas: ప్రభాస్‌ యూకే ట్రిప్‌… సినిమా కోసం కాదు!

ప్రభాస్‌… బ్రిటన్‌ వెళ్లబోతున్నాడు. అందులో పెద్ద విషయమేముంది… ఏ సినిమా షూటింగో ఉండుంటుందిచ అందుకే వెళ్తున్నాడు అంటారా. ఆగండాగండి ఆయన వెళ్తోంది షూటింగ్‌ చేయడానికి కాదు, షూటింగ్‌ కోసం రెడీ అవ్వడానికి అనేది ఇక్కడ పాయింట్‌. అవును ప్రభాస్‌ తన నెక్స్ట్‌ సినిమా కోసం రెడీ అవ్వడానికే బ్రిటన్‌ వెళ్తున్నాడట. ప్రభాస్‌ ప్రస్తుతం వరుసగా మూడు (నిజానికి నాలుగు) సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలియకుండానే బరువు పెరిగిపోయాడట. అందుకే బ్రిటన్‌ ట్రిప్‌.

ప్రభాస్‌ లైనప్‌లో ‘ఆదిపురుష్‌’ అనే సినిమా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో మన రాజుగారు రాముడిలా కనిపించబోతున్నారు. దీని కోసం బాడీ ఫిట్‌గా ఉండాలని దర్శకుడు ఓంరౌత్‌ అప్పుడే చెప్పారట. దానికి తగ్గట్టుగానే ప్రభాస్‌ సిద్ధమయ్యాడు కూడా. కానీ కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో సినిమా చిత్రీకరణ ఆలస్యమైంది. ఈలోగా ప్రభాస్‌ లావెక్కాడు. మొన్నీమధ్య ఈ సినిమా షూటింగ్‌కి వెళ్లినప్పుడు కొన్ని ఫొటోలు బయటికొచ్చాయి. బాగా లావెక్కాడు అని ట్రోల్‌ కూడా చేశారుగా.

ప్రభాస్‌ మీద ట్రోల్స్‌ వస్తున్నాయనో, ఇంకేదైనా కారణమో కానీ, ప్రభాస్‌ ఇప్పటికిప్పుడు బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడట. దీని కోసం యూకేలో స్పెషల్‌ డైట్‌ పాటించాలని అనుకుంటున్నాడట. దీని కోసం త్వరలో బ్రిటన్‌ ప్రయాణం కడతాడట. వరల్డ్ క్లాస్ డైటీషియన్ల ఆధ్వర్యంలో ప్రభాస్ కు పూర్తిస్థాయిలో బాడీ చెకప్ చేయించి.. అసలు సమస్య ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారట. దానికి తగ్గట్టుగా ప్లానింగ్‌ చేస్తారట.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus