Prabhas: 13 నెలల్లో మూడు సినిమాలు.. ప్రభాస్ డెడికేషన్ కు ఫిదా అవ్వాల్సిందే!

  • June 12, 2024 / 01:26 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ (Prabhas) కొన్ని నెలల క్రితం ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలను రిలీజ్ చేసేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటానని ఫ్యాన్స్ కు మాట ఇచ్చారు. అయితే ప్రభాస్ స్వయంగా చెప్పినా ఆ మాటలను చాలామంది నమ్మలేదు. టాలీవుడ్ స్టార్స్ ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడేళ్ల సమయం కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. అందువల్ల ప్రభాస్ చెప్పిన మాటలు ఆచరణ సాధ్యం కావని చాలామంది ఫీలయ్యారు.

అయితే వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న ప్రభాస్ కేవలం 13 నెలల్లో ఆదిపురుష్ (Adipurush)  సలార్ (Salaar) , కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాలను రిలీజ్ చేయడం ద్వారా తన స్పీడ్ కు ఎవరూ సాటిరారని ప్రూవ్ చేస్తున్నారు. ప్రభాస్ డెడికేషన్ కు సైతం ఫిదా అవ్వాల్సిందే అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇతర స్టార్ హీరోలు సినిమాలకు సంబంధించి ప్రభాస్ వేగాన్ని అందుకోవాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రభాస్ ఈ ఏడాది కన్నప్ప సినిమాతో వచ్చే ఏడాది ఫస్టాఫ్ లో రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇదే సమయంలో ప్రభాస్ సినిమాలు బిజినెస్ విషయంలో సైతం అదరగొడుతున్నాయి. అదే సమయంలో రెమ్యునరేషన్ విషయంలో సైతం సౌత్ ఇండియాలోని టాప్ హీరోలలో ప్రభాస్ ఒకరిగా ఉన్నారు. ప్రభాస్ కల్కి బాహుబలి సిరీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

బాహుబలి2 సినిమాతో తను క్రియేట్ చేసిన రికార్డులను ప్రభాస్ బ్రేక్ చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కల్కి 2898 ఏడీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండటం గమనార్హం. కల్కి 2898 ఏడీ బడ్జెట్ పరంగా టాప్ లో ఉండగా కలెక్షన్ల పరంగా కూడా టాప్ లో ఉంటుందేమో చూడాల్సి ఉంది. ప్రభాస్ కు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus