Prabhas , Hanu Raghavapudi: హను రాఘవపూడితో సినిమా అంటే ఇంతేమరి!

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  తన కొత్త సినిమా ‘ఫౌజీ’ షూటింగ్‌లో గాయపడ్డారు. ఆయన చీలమండకు గాయం కావడంతో, ఫౌజీ షూటింగ్‌తో పాటు ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD)  సినిమా ప్రమోషన్ ట్రిప్‌ను కూడా రద్దు చేసుకున్నారు. ‘కల్కి 2898 AD’ సినిమా 2025, జనవరి 3న జపాన్‌లో విడుదల కానుంది. ప్రభాస్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటుండగా, అతను త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రభాస్ కోలుకున్న తర్వాత వచ్చే ఏడాది ఆరంభంలో ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది.

Prabhas ,Hanu Raghavapudi

ఈ సినిమా స్వాతంత్ర్యానికి ముందు 1947 కి ముందు ఆ టైమ్ నాటి కథాంశంతో కూడిన యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. దీనికోసం ఇప్పటికే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ జైలు సెట్‌తో సహా పెద్ద ఎత్తున సెట్స్ వేశారు. ఇక్కడే ఇటీవల చిత్ర బృందం కీలక సన్నివేశాలను చిత్రీకరించింది.దర్శకుడు హను రాఘవపూడి  (Hanu Raghavapudi) , ఆయన టీమ్ కోలకతాలో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారు.

చారిత్రాత్మక కట్టడాలు, బెంగాలీ సంస్కృతికి ప్రసిద్ధి చెందిన ఈ నగరం, పీరియడ్ డ్రామాకి సరైన నేపథ్యాన్ని అందిస్తుంది. ప్రస్తుతం చిత్ర బృందం లొకేషన్ల వేటలో ఉంది. మంచి రియల్ లొకేషన్స్ దొరికితే, వేసవిలో నెల రోజుల పాటు షూటింగ్ అక్కడే ప్లాన్ చేస్తారు. ‘ఫౌజీ’ సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో పాటు, ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ కూడా ఉంటుందని సమాచారం. ఈ సినిమాతో ఇమాన్వి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు.

 వంశీ పైడిపల్లి అదృష్టం మామూలుగా లేదుగా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus