పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ,దర్శకుడు మారుతి (Maruthi Dasari) కాంబినేషన్లో ‘ది రాజాసాబ్’ (The Rajasaab) సినిమా ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా మొదలైంది. దీంతో కచ్చితంగా ఈ సినిమా త్వరగా కంప్లీట్ అవుతుంది. ‘బాహుబలి’ (Baahubali) తర్వాత ప్రభాస్ నుండి ఫాస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమా ఇదే అవుతుంది అని అంతా భావించారు. కానీ ఇది కూడా ప్రభాస్ అన్ని సినిమాల్లాగే ఆలస్యమవుతూ వస్తోంది. 2025 జనవరి 10న ‘ది రాజాసాబ్’ వస్తుందని నిర్మాత ప్రకటించారు.
కానీ తర్వాత ఏప్రిల్ 10 కి ఫిక్స్ అని గ్లింప్స్ తో ప్రకటించారు. కానీ ఆ డేట్ కి సినిమా రాలేదు. కనీసం వాయిదా పడింది అని కూడా నిర్మాతలు, దర్శకుడు స్పందించని పరిస్థితి. మారుతి సింపుల్ గా వీఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ అవ్వలేదు అంటున్నాడు. కానీ లోపల వ్యవహారం చాలా ఉందనేది ఇండస్ట్రీ టాక్. వీఎఫ్ఎక్స్ కంపెనీ వాళ్ళతో పీపుల్ మీడియా వారికి గొడవ అయ్యింది. అందుకే అనుకున్న టైంకి వాళ్ళు ఔట్పుట్ ఇవ్వలేదు అనేది ఓ టాక్.
మరో టాక్ ఏంటంటే.. ఈ సినిమా షూటింగ్ పార్ట్ కొంత బ్యాలెన్స్ ఉందట. రీ షూట్లు వంటివి కూడా కొన్ని చేయాల్సి ఉందట. అందువల్ల డిలే అవుతుంది అంటున్నారు. తాజాగా ప్రభాస్ విదేశాల నుండి హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు. సో ఆ బ్యాలెన్స్ పార్ట్ కంప్లీట్ చేస్తే.. ప్రభాస్ వరకు తన డ్యూటీ కంప్లీట్ చేసినట్టే..! మరోపక్క టీజర్ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ నెలాఖరులో ‘ది రాజాసాబ్’ టీజర్ అభిమానుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.