Kayadu Lohar: మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన ‘డ్రాగన్’ బ్యూటీ..!

నాని (Nani) , ‘దసరా’  (Dasara)   ఫేమ్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో ‘ది పారడైజ్’ (The Paradise)  అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గ్లింప్స్ ను ఇటీవల విడుదల చేశారు. అందులో భయంకరమైన వయొలెన్స్, బూతులు ఉండటంతో బాగా వైరల్ అయ్యింది. సినిమాలో ఇంకా నెక్స్ట్ లెవెల్ వయొలెన్స్ ఉంటుందని కూడా గ్లింప్స్ తో స్పష్టంచేశారు. అలాగే 2026 మార్చి 26న రిలీజ్ అవుతుందని కూడా ప్రకటించేశారు. త్వరలోనే షూటింగ్ కూడా మొదలు కానుంది.

Kayadu Lohar

అయితే ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు ఇంకా రివీల్ చేయలేదు. గ్లింప్స్ ను కూడా చాలా వరకు ఏ ఐ(artificial intelligence) తో రూపొందించారు. నాని లుక్ ను కూడా సరిగ్గా రివీల్ చేయలేదు. అయితే ‘ది పారడైజ్’ కథ ప్రకారం ఇందులో తల్లి పాత్ర చాలా కీలకంగా ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. ఆ పాత్ర కూడా చాలా బోల్డ్ గానే ఉంటుందట.

తెలుగు సినిమా చరిత్రలో లేని విధంగా తల్లి పాత్రతో కూడా బూతులు చెప్పిస్తారనే టాక్ కూడా ఉంది. ఆల్రెడీ ఈ పాత్ర రమ్యకృష్ణని (Ramya Krishnan) అప్రోచ్ అయినట్టు టాక్ నడిచింది. కానీ ఆమె ఈ పాత్ర గురించి విని షాకయ్యారట. ఇంకా ఆమె ఫైనల్ డెసిషన్ చెప్పలేదని అంటున్నారు.మరోపక్క విలన్ గా ‘కిల్’ నటుడు రాఘ‌వ్ ను తీసుకున్నట్టు అంతా చెబుతున్నారు.

ఇక ఇప్పుడు హీరోయిన్ వంతు వచ్చింది. ‘డ్రాగన్’ తో  (Return of the Dragon)  మంచి గుర్తింపు తెచ్చుకున్న కయాడు లోహార్ ను (Kayadu Lohar ) హీరోయిన్ గా తీసుకున్నారు అనేది తాజా సమాచారం. మరోపక్క ఆమె రవితేజ (Ravi Teja) – కిషోర్ తిరుమల  (Kishore Tirumala)  సినిమాలో కూడా హీరోయిన్ గా నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ‘ది పారడైజ్’ కూడా కన్ఫర్మ్ అయితే ఆమె రేంజ్ మరింతగా పెరిగినట్టే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus