Prabhas: కన్నడ సినిమాపై ప్రభాస్ ప్రశంసలు!

ఒకప్పుడు శాండల్ వుడ్ నుంచి వచ్చిన సినిమాలు అక్కడ వరకే పరిమితమయ్యేవి. కానీ ‘కేజీఎఫ్’ సినిమా శాండల్ వుడ్ మార్కెట్ ని వెయ్యి కోట్ల స్థాయికి చేర్చింది. ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మించారు. అదే సంస్థ ఇప్పుడు ప్రభాస్ హీరోగా ‘సలార్’ సినిమాను తెరకెక్కిస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ కి దూరంగా.. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మిస్తోంది హోంబలే ఫిలిమ్స్. ఇప్పుడు ఈ బ్యానర్ లో మరో హిట్ సినిమా పడింది.

అదే ‘కంటరా’. అంటే దట్టమైన అడవి అని అర్ధం. తాజాగా ఈ సినిమాను భారీ ఎత్తున కర్ణాటకలో రిలీజ్ చేశారు. తమిళ, తెలుగు వెర్షన్స్ లో కూడా రిలీజ్ చేయాలనుకున్నారు కానీ థియేటర్ల సమస్యతో పాటు ప్రమోషన్స్ కు సమయం లేకపోవడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ‘కంటరా’ సినిమాకి ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అటవీ సంపదను రక్షించే విషయంలో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ కి, అక్కడే ఉంటూ తాతలు తండ్రుల వృత్తిని నమ్ముకున్న యువకుడికి మధ్య నడిచే స్టోరీనే ఈ సినిమా.

ఈ సినిమాను రిషబ్ శెట్టి డైరెక్ట్ చేయడంతో పాటు హీరోగా కూడా నటించారు. విలేజ్ నేటివిటీ నేపథ్యంలో అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు. రా డ్రామాలను ఇష్టపడే ఆడియన్స్ కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఈ సినిమాను ప్రభాస్ కూడా చూసినట్లు ఉన్నారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టేటస్ ను షేర్ చేశారు.

‘కంటర’ సినిమా అద్భుతంగా ఉందని.. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని.. ముఖ్యంగా క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుందని.. సినిమాపై ప్రశంసలు కురిపించారు. త్వరలోనే ఈ సినిమా తెలుగులో వచ్చే ఛాన్స్ ఉంది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus