పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హోంబోలే ఫిల్మ్స్ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థతో ప్రభాస్ మూడు ప్రాజెక్టులు చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వివరాలు ఇప్పటివరకు వెల్లడించలేదు. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ ప్రాజెక్ట్‌లలో ఒకదానికి దర్శకత్వం వహించబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం, ఆ ప్రాజెక్ట్ నుండి ప్రశాంత్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ (Prabhas), ప్రశాంత్ వర్మ మధ్య కథ చర్చలు జరిపినప్పటికీ, ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని ఇండస్ట్రీలో టాక్.
కథపై అభిప్రాయ భేదాలు వచ్చాయా లేక హోంబోలే ఫిల్మ్స్ పెట్టిన షరతులు ప్రాజెక్ట్‌ను పక్కకు నెట్టాయా అన్నది క్లారిటీ లేదు. పైగా, ప్రాజెక్ట్‌ను సక్సెస్‌ఫుల్‌గా చేయగల దిశగా క్రియేటివ్ డెసిషన్స్ తీసుకోవడంలో ఇరువర్గాలు ఒకే తాటిపై నిలవలేకపోయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఇటీవల ప్రశాంత్ వర్మ కథ అందించిన ప్రాజెక్ట్ లు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గౌతమీ నందన వాసుదేవ (Devaki Nandana Vasudeva) చిత్రానికి మిశ్రమ స్పందన రాగా, మైత్రీ మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ కూడా రద్దు కావడం ప్రశాంత్ కెరీర్‌పై ప్రభావం చూపింది. ఈ పరిణామాలు ప్రభాస్‌తో ఆయన ప్రాజెక్ట్ రద్దుకి కారణమయ్యాయని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం హోంబోలే ఫిల్మ్స్ ప్రభాస్ ప్రాజెక్ట్‌ల కోసం కొత్త దర్శకులపై దృష్టి పెట్టినట్లు సమాచారం.
క్రియేటివ్ గా సరైన దర్శకుడిని కనుగొనడంపై హోంబోలే ఫోకస్ పెట్టింది. ఈ ప్రాజెక్ట్‌లు ఎలాంటి కథాంశాలతో, ఎవరితో ముందుకు సాగుతాయన్నది ఆసక్తిగా మారింది. ప్రభాస్ (Prabhas), హోంబోలే కాంబినేషన్‌పై ఉన్న అంచనాలు పాన్ ఇండియా స్థాయిలో రికార్డు స్థాయిలో ఉన్నాయి. మరి వచ్చే దర్శకుడు ఎవరో కాలమే సమాధానం చెప్పాలి.