యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన పశ్చిమ గోదావరి వాస్తవ్యుడు అన్న సంగతి తెలిసిందే. ఈయన పెరిగింది అంతా మొగల్తూరు, భీమవరం ప్రాంతాల్లోనే..! ప్రభాస్ హీరో అయిన తరువాత కూడా.. ప్రతీ సంక్రాంతికి భీమవరం, మొగల్తూరు వంటి ఊర్లకు వెళ్లొచ్చేవాడు. ముఖ్యంగా ప్రభాస్ కు కోడి పందాలు చూడడం, వెయ్యడం అంటే చాలా ఇష్టం. అలా 2010వ సంవత్సరం వరకు ప్రభాస్ కోడిపందాలకు వెళ్ళేవాడు. కానీ 2010 లో ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ గారు మరణించిన దగ్గరనుండీ.. కోడిపందాలకు వెళ్లడం మానేసాడట ప్రభాస్.
కొన్నాళ్ళ తరువాత అతను వెళ్ళాలని ఆశపడ్డాడట, కానీ కొన్ని ఒత్తిడుల కారణంగా ఆ చిన్న ఆనందానికి అతను దూరమయ్యాడట. ముఖ్యంగా ప్రభాస్ ను ఆ ఊర్లకు రావొద్దు అని కొంతమంది పెద్దలు కోరినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అతను స్టార్ కాబట్టి.. తొక్కిసలాటలు వంటివి జరుగుతాయి అనే ఉద్దేశంతో ప్రభాస్ ను కోడి పందాలు చూడడానికి రావొద్దని వారు కోరినట్టు ప్రచారం జరిగింది. ఈ విషయం పై ఇటీవల ప్రభాస్ ఊరికి చెందిన ఓ వ్యక్తి క్లారిటీ ఇచ్చాడు. ‘చిన్నప్పటి నుండీ ప్రభాస్ ను చూస్తూ వచ్చానని. ఎటువంటి అహంకారం లేని వ్యక్తి ప్రభాస్ అని అతను తెలిపాడు.
అంతేకాదు ప్రభాస్ కు మా ఊర్లో కోడిపందాలు చూడాలని చాలా ఆశ..! అతను వస్తే మాకు కూడా ఆనందంమే..! కానీ అతను వస్తే ఏమవుతుందో అని భయం. ప్రభాస్ వస్తే సెక్యూరిటీగా పోలీసులు కూడా రావాలి. ప్రజలు ఆనందంగా గడిపే అలాంటి చోటుకి పోలీసులు రాకూడదనే ఆ 4 రోజులకి మేము పర్మిషన్లు తెచ్చుకుంటాం. మరి ప్రభాస్ కనుక అక్కడికి వస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అనే భయం మాకు ఉంది’ అంటూ ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!