Prabhas, Mahesh Babu: మహేష్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లో నటించడానికి ప్రభాస్ కారణమా..?

విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు లు హీరోలుగా..అంజలి, సమంత లు హీరోయిన్లుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. టాలీవుడ్లో చాలా గ్యాప్ తర్వాత రూపొందిన మల్టీ స్టారర్ మూవీ ఇది. ఓ రకంగా ఇప్పుడు మల్టీస్టారర్ చిత్రాలు ఎక్కువగా రూపొందుతున్నాయి అంటే దానికి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం వల్లే అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

2013వ సంవత్సరం జనవరి 11న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల అయ్యింది. ఈ చిత్రం విడుదలై 10 ఏళ్ళు పూర్తి కావస్తున్నా… ఇప్పటికీ బుల్లితెర పై ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. అయితే ఈ చిత్రం రూపొందింది అంటే అది మహేష్ బాబు వల్లే అంటూ దిల్ రాజు పదే పదే చెబుతూనే ఉన్నారు. అయితే మహేష్ బాబు ఈ చిత్రంలో నటించడానికి కారణం ప్రభాస్ అట. ఎలా అంటే.. 2011 లో రిలీజ్ అయిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఈ సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు.. నిర్మాత దిల్ రాజుకి మెసేజ్ పెట్టారట. ‘ఓ మాస్ హీరోతో ఇలాంటి క్లాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయడం మామూలు విషయం కాదు.. సినిమా చాలా బాగుంది’ అంటూ దిల్ రాజుకి మెసేజ్ చేసాడట మహేష్. అదే టైంలో శ్రీకాంత్ అడ్డాల ‘సీతమ్మ వాకిట్లో..’ స్క్రిప్ట్ రెడీ చేయడం వెంకటేష్ పెద్దోడు రోల్ కి ఫిక్స్ అవ్వడం జరిగిందట. మహేష్ మెసేజ్ చూసిన దిల్ రాజు..

‘శ్రీకాంత్ తో ఓసారి (Mahesh) మహేష్ బాబుకి కథ చెబుదాం.. ఏమంటారో చూద్దాం’ అని ‘దూకుడు’ సెట్స్ కు వెళ్లి శ్రీకాంత్ అడ్డాలతో కథ చెప్పించాడట. అంతే వెంటనే మహేష్ ఓకే చెప్పేశాడు. ఆ తర్వాత ‘బిజినెస్ మెన్’ కూడా కంప్లీట్ అవ్వడం. వెంటనే ‘సీతమ్మ వాకిట్లో..’ సెట్స్ పైకి వెళ్లడం జరిగింది. అలా ప్రభాస్ సినిమా వల్ల మహేష్ ‘సీతమ్మ వాకిట్లో..’ లో నటించడం జరిగిందన్న మాట.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus