సాహో షూటింగ్ లో జాయిన్ అయిన ప్రభాస్

ఆరునెలల గ్యాప్ తర్వాత ప్రభాస్ మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి ముందే టీజర్ రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ప్రభాస్ యాక్షన్ సన్నివేశాల కోసం ముంబైలో రెండు నెలలుగా శిక్షణ తీసుకున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు 225  కోట్ల బడ్జెట్ తో ఏకకాలంలో మూడు భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమాకోసం రామోజీ ఫిలిం సిటీలో 5 కోట్లు వెచ్చించి భారీ సెట్ నిర్మించారు. ఆ సెట్ లోనే ఈ రోజు షూటింగ్ మొదలైంది.

ఈ చిత్రీకరణలో ప్రభాస్ పాల్గొన్నారు. మరో రెండు రోజుల్లో హీరోయిన్ శ్రద్ధ కపూర్ కూడా ఈ షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు సమాచారం. ఈ సెట్ లోనే దాదాపు 50 శాతం షూటింగ్ జరగనున్నట్లు తెలిసింది. అనంతరం చిత్ర బృందం దుబాయ్ కి వెళ్లనుంది. అక్కడి ప్రఖ్యాత ప్రదేశాల్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus