ప్రభాస్ ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉండటంతో పాటు వరుస సినిమాలలో నటిస్తున్నారు. కల్కి 2889 ఏడీ, రాజాసాబ్, స్పిరిట్ సినిమాలతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లు ప్రభాస్ ఖాతాలో ఉన్నాయి. ప్రభాస్ హను రాఘవపూడి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది. సలార్2 మూవీ కూడా త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉందని ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే సలార్ సినిమాకు ప్రభాస్ పారితోషికం 125 కోట్ల రూపాయలు కాగా ప్రభాస్ కు సెకనుకు 80 లక్షల రూపాయల పారితోషికం దక్కిందని ఫ్యాన్స్ కొత్త లెక్కలను తెరపైకి తెస్తున్నారు.
సినిమా మొత్తం కలిపి ప్రభాస్ 2 నిమిషాల 35 సెకన్లు మాత్రమే డైలాగ్స్ చెప్పారని ఆ లెక్క ప్రకారం సెకనుకు 80 లక్షల రూపాయల పారితోషికం దక్కిందని అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సెకనుకు లక్షల్లో నిమిషానికి కోట్లలో పారితోషికం అందుకున్న రికార్డ్ ప్రభాస్ కు మాత్రమే సొంతమని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
సలార్ మూవీ ఫుల్ రన్ లో 730 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంది. ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు అంతకు మించి కలెక్షన్లను సాధించడం ఖాయమని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో సత్తా చాటుతుండగా రాబోయే రోజుల్లో ప్రభాస్ కు ఎలాంటి విజయాలు దక్కుతాయో చూడాల్సి ఉంది.
ప్రభాస్ (Prabhas) భవిష్యత్తు ప్రాజెక్ట్ లు 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ కెరీర్ విషయంలో మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.