‘ప్రభాస్ 20’ టైటిల్ అదే… కన్ఫార్మ్ చేసిన ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో 3 రోజుల్లో ‘సాహో’ తో థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయ్యాడు. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని.. 350 కోట్ల భారీ బడ్జెట్ తో యూవీ. క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్ లు నిర్మించారు. ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ లు హాలీవుడ్ స్థాయిలో ఉందబోతున్నాయని టీజర్,ట్రైలర్ లు చూస్తే స్పష్టమవుతుంది. ఇక ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్ లు ఓ రేంజ్లో జరుగుతున్నాయి. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో కలెక్షన్లు రావడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా… ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతున్నాడు ప్రభాస్. ‘ఇక ‘సాహో’ తర్వాత కూడా భారీ బడ్జెట్ సినిమాల్లోనే నటిస్తారా.. ముఖ్యంగా బాలీవుడ్ లో కూడా నటిస్తారా… ?’ అనే ప్రశ్న ప్రభాస్ కు ఎదురవుగా… “ఏదైనా కథను బట్టే, అలాంటి కథ వస్తే ప్యాన్ ఇండియా సినిమా చేస్తాను. ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వస్తున్నాయి. ‘సాహో’ రిజల్ట్ ను బట్టే తరువాత సినిమాలు గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతం ‘జాన్’ మూవీ షూటింగ్ జరుగుతుంది” అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే ఫ్లో లో తన నెక్స్ట్ సినిమా టైటిల్ ‘జాన్’ అని కన్ఫార్మ్ చేసేశాడు. ముందు నుండీ ఈ టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ అధికారికంగా ప్రకటించకముందే.. ప్రభాస్ ఇలా లీక్ చేసేసాడన్న మాట. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus