రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటాయని అర్థమైంది. ఇక డార్లింగ్ ఒక్కో సినిమా రెండు వందల యాభై కోట్లకు తక్కువ కాకుండా రూపొందుతున్నాయి. అత్యధికంగా 600.కోట్ల బడ్జెట్ ను పెట్టుబడిగా పెడుతున్నారు. ప్రభాస్ ఒక్క సినిమాకు వంద కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. కొన్ని పెద్ద సినిమాలకు అయితే 150 కోట్లు కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ మూడేళ్లలో మాత్రం 8 సినిమాలను పక్కగా రిలీజ్ చేసుకునే విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
ముందుగా రాధేశ్యామ్ సినిమా మార్చి 11వ తేదీన విడుదల కాబోతోంది. ఇక మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజా డీలక్స్ ఇదే ఏడాది పూర్తి చేసి ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక ఆదిపురుష్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 13న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక 2023 సమ్మర్ లోనే ఈ సినిమా విడుదల కానుంది. ఆ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది కాబట్టి మరొక సినిమాను ఏడాది చివర్లో తీసుకువచ్చే ఛాన్స్ ఉంది.
ఇక ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు K 2023 లేదా 2024 మొదట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక ఆ తర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా 2024 లో నే రానుంది. సిద్ధార్థ ఆనంద్ తో కూడా ఒక సినిమా అనుకుంటున్నారు. ఆ సినిమా కూడా 2024 చివరలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 2025 లోనే దిల్ రాజుతో కూడా ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు.
ఆ సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రభాస్ కోసం మరికొంతమంది బాలీవుడ్ అగ్ర దర్శకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి అయితే ఇప్పటి వరకు ప్రభాస్ తన డైరీలో రాధేశ్యామ్ తో పాటు మరొక 9 సినిమాలకు ఫినిష్ చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.