ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ చిత్రం చేస్తున్నాడు. దీంతో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఒక సినిమా అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్లో ఒక సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఇవి పూర్తవ్వాలంటే మరో రెండేళ్లు పైనే పడుతుంది. ఇక మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ అనే చిత్రం చెయ్యడానికి రెడీ అయ్యాడు. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్(బుజ్జి) ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం పూర్తయ్యాక వెంటనే త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు.
‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని టాక్. అది పూర్తయ్యాక రాజమౌళితో సినిమా చెయ్యాలి. దానికి ఎలాగూ 2ఏళ్ళు టైం పడుతుంది కాబట్టి.. మహేష్ ఒక 4 ఏళ్ళ వరకూ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇక రాంచరణ్ అయితే ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తున్నాడు. ఇది పూర్తవ్వడానికి మరో సంవత్సరం టైం అయినా పడుతుంది. మధ్యలో ‘ఆచార్య’ చిత్రం కూడా చేస్తున్నాడు. ఏది ఏమైనా ఈ ముగ్గురు హీరోలు తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే ఈ హీరోలతో సినిమాలు చెయ్యాలని ఓ బడా నిర్మాత తహతహలాడుతున్నాడట.
ఆ నిర్మాత ఆల్రెడీ ఈ ముగ్గురి హీరోలతో సినిమాలు చేసాడు. అవి సక్సెస్ సాధించాయి కూడా.! అయితే ఇప్పుడు తెలిసిన దర్శకులను ఈ ముగ్గురి హీరోల దగ్గరకు పంపించి కథలు వినిపించే ఏర్పాట్లు చేస్తున్నాడట. అయితే అవేమి వాళ్లకు నచ్చడం లేదని తెలుస్తుంది. ఇప్పట్లో ఎలాగూ ఖాళీగా లేరు, ఓ 5ఏళ్ళు టైం పట్టినా పర్వాలేదు ఈ ముగ్గురి హీరోలను లైన్లో పెట్టి సినిమాలు ఓకే చేయించుకోవాలని ఆ నిర్మాత తపన. వాళ్లేమో పాన్ ఇండియా సినిమాలు చెయ్యాలని చూస్తున్నారని వినికిడి. ఈ నిర్మాతేమో చిన్న డైరెక్టర్లు లేదా మీడియం రేంజ్ డైరెక్టర్లనే ఎంచుకుంటాడు. మరి ఇతని కోరిక తీరేది ఎలా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యింది.