Prabhas, Mahesh Babu: ప్రభాస్, మహేష్ లను అలా చూడబోతున్నామా.. ట్విస్ట్ ఏంటంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్, మహేష్ లకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఈ ఇద్దరు హీరోల సినిమాలకు ఊహించని రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది. ఈ హీరోలు తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తామని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఆదిపురుష్ మూవీ మరో మూడు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమాకు సంబంధించి వస్తున్న అప్ డేట్స్ ప్రేక్షకులకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ బుకింగ్స్ విషయంలో సంచలనాలు సృష్టించడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మరోవైపు మహేష్ బాబు విషయానికి వస్తే మహేష్ త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. అయితే ఈ ఇద్దరు హీరోలకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్వెల్ సూపర్ హీరోలుగా మహేష్, ప్రభాస్ ఉండగా ఈ ఫోటో అభిమానులకు తెగ నచ్చేసింది.

ఈ ఇద్దరు స్టార్ హీరోల కాంబినేషన్ లో ఈ తరహా కథాంశంతో సినిమా తెరకెక్కితే మాత్రం ప్రేక్షకుల అంచనాలను మించి సినిమా విజయం సాధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ప్రభాస్, మహేష్ ఫోటోలను క్రియేట్ చేయడం జరిగిందని తెలుస్తోంది. ఈ ఫోటోలు మాత్రం రియల్ ఫోటోలలానే ఉన్నాయి. దర్శకులు ఎవరైనా మార్వెల్ తరహా కథాంశంతో ఈ హీరోలను సంప్రదిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

(Prabhas) ప్రభాస్, మహేష్ లను ఒకే సినిమాలో చూడాలని ఉందని అభిమానులు కోరుకుంటున్నారు. మహేష్, ప్రభాస్ పారితోషికాలు భారీగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ఈ హీరోలకు ఇతర భాషల్లో కూడా క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. మహేష్, ప్రభాస్ కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus