Prabhas: ఫ్యాన్ కోసం ప్రభాస్ ఏం చేశారంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ చేతినిండా సినిమా ఆఫర్లు ఉన్నాయి. ప్రభాస్ డేట్లు సంపాదించాలని టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ప్రభాస్ తో 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాను తెరకెక్కించినా నిర్మాతలకు భారీ మొత్తంలో లాభాలు మిగిలే ఛాన్స్ ఉంది. ప్రభాస్ సినిమాలకు బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. అయితే ప్రభాస్ తను ఎంత బిజీగా ఉన్నా అభిమాని కోరిన కోరికను తీర్చి మంచి మనస్సును చాటుకున్నారు.

హైదరాబాద్ లో ఒక ఆస్పత్రిలో గత కొన్నిరోజుల నుంచి శోభిత అనే అమ్మాయి చికిత్స తీసుకుంటోంది. క్యాన్సర్ తో బాధ పడుతున్న శోభితకు స్టార్ హీరో ప్రభాస్ అంటే ఎంతో అభిమానం. ప్రభాస్ వీడియో కాల్ ద్వారా అభిమానికి సర్ప్రైజ్ ఇవ్వగా ప్రభాస్ ఇచ్చిన సర్ప్రైజ్ తో అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రభాస్ బిజీ షెడ్యూల్ లో కూడా అభిమాని కోసం సమయం కేటాయించడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. శోభితను భయపడవద్దని త్వరగా కోలుకుంటావంటూ ప్రభాస్ ధైర్యం చెప్పారు.

మిర్చి సినిమా సమయంలో కూడా ప్రభాస్ షూటింగ్ ను ఆపి అనారోగ్యంతో బాధ పడుతున్న అభిమానిని కలిసిన సంగతి తెలిసిందే. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ వచ్చే ఏడాది మూడు సినిమాలను విడుదల చేయడానికి సిధ్దంగా ఉన్నారు. కొన్ని నెలల గ్యాప్ తోనే ఈ సినిమాలు రిలీజ్ కానుండగా ఈ మూడు సినిమాల బడ్జెట్ ఏకంగా 1000 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus