Prabhas Vs Jr NTR: 2026 సంక్రాంతి పోటీ మామూలుగా ఉండదంటున్న ఫ్యాన్స్.. కానీ?

టాలీవుడ్ ఇండస్ట్రీకి కీలకమైన సీజన్లలో సంక్రాంతి ఒకటని చెప్పడంలో సందేహం అవసరం లేదు. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైతే యావరేజ్ సినిమాలు సైతం హిట్ గా నిలుస్తాయని ఇండస్ట్రీలో టాక్ ఉంది. 2026 సంక్రాంతికి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ థియేటర్లలో రిలీజ్ కానుందని అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. సినిమా ఆ తేదీకి కచ్చితంగా విడుదలయ్యే విధంగా ఎన్టీఆర్ (Jr NTR) ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ప్లాన్స్ ఉన్నాయి. అయితే ప్రభాస్ (Prabhas) సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబో మూవీ స్పిరిట్ (Spirit) లేదా ప్రభాస్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబో మూవీ ఫౌజీలలో ఒక సినిమా అదే తేదీన థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.

Prabhas Vs Jr NTR

ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీకి డ్రాగన్ టైటిల్ ను పరిశీలిస్తుండగా డ్రాగన్ టైటిల్ ఫిక్స్ అయితే మాత్రం అధికారికంగా ప్రకటించే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. 2026 సంక్రాంతి పోటీ మామూలుగా ఉండదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి మూడు నుంచి నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. 2026 సంక్రాంతి పోటీ మాత్రం భారీ స్థాయిలో ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్, ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సందర్భాలు తక్కువగానే ఉన్నాయి. ఈ ఇద్దరు హీరోలు పోటీ పడితే సంక్రాంతి రేసు మామూలుగా ఉండదని చెప్పవచ్చు. అయితే ఒక పాన్ ఇండియా సినిమాతో మరో పాన్ ఇండియా సినిమా పోటీ పడటం వల్ల రెండు సినిమాలు కొన్ని సందర్భాల్లో నష్టపోయే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఈ రెండు సినిమాల బడ్జెట్ 600 నుంచి 700 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండే అవకాశాలు అయితే ఉంది. ఈ సినిమాలకు బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. టాలీవుడ్ స్టార్స్ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

అన్ స్టాపబుల్ షోపై పెరుగుతున్న అంచనాలు.. అలా చేయాల్సిందే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus