ఒకే పాయింట్ తో వచ్చిన వెంకటేష్, ప్రభాస్ సినిమాలు.. ఫలితాలు మాత్రం సేమ్

‘బొబ్బిలి రాజా’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత దానికి పూర్తి భిన్నంగా ‘శత్రువు’ అనే సినిమా చేశారు వెంకటేష్. కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఆ సినిమా 1991 జనవరి 2న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘కూలీ నెంబర్ 1’ చేశాడు. అది కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత అప్పటి స్టార్ డైరెక్టర్ ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘సూర్య ఐపీఎస్’ అనే సినిమా చేశారు వెంకటేష్. విజయశాంతి హీరోయిన్ గా నటించింది.

Surya IPS

క్రేజీ కాంబో ఇది. వరుస హిట్ల తర్వాత వెంకటేష్ చేసిన కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ కట్ చేస్తే ‘సూర్య ఐపీఎస్’ నిరాశపరిచింది.ముందు నుండి నెలకొన్న హైప్ కారణంగా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని అందుకుంది కానీ.. అనుకున్న ఫలితాన్ని సాధించడంలో విఫలమైంది.

ఇందుకు కారణాలు లేకపోలేదు. ఈ సినిమా కథ ప్రకారం ‘హీరో తన తండ్రిని చంపాలనుకుంటాడు’ అది ఆడియన్స్ కి రుచించలేదు. అలాగే వెంకటేష్ కంటే కూడా హీరోయిన్ విజయశాంతికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు అని… ఇంకో రకంగా చెప్పాలంటే ‘విజయశాంతి ముందు వెంకటేష్ ను తక్కువ చేసి చూపించారని’ అప్పట్లో వెంకటేష్ అభిమానులు హర్ట్ అయ్యారు. వాస్తవానికి ‘శత్రువు’ లో కూడా విజయశాంతినే హీరోయిన్. కాకపోతే దర్శకుడు కోదండరామిరెడ్డి బ్లాక్ బస్టర్ సినిమాల్లో విజయశాంతి ఎక్కువగా హీరోయిన్ గా చేశారు. అందువల్ల అతను ఆమె కలిగి ఉన్న లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ను బ్యాలెన్స్ చేసే క్రమంలో కథనం గాడి తప్పింది అనేది కొందరి అభిప్రాయం. విజయశాంతికి ఉన్న డిమాండ్ కూడా అలాంటిది మరి.

సరే ‘సూర్య ఐపీఎస్’ లాంటి లైన్ తోనే ప్రభాస్ నటించిన ‘మున్నా’ కూడా రూపొందింది.2007లో వచ్చిన ఈ సినిమాలో కూడా ‘హీరో తండ్రిని చంపాలనుకుంటాడు’.దీనికి కూడా ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు. వంశీ పైడిపల్లి దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. నిర్మాత దిల్ రాజు వరుస విజయాలకు బ్రేక్ వేసిన సినిమా ఇది.

‘మదరాసి’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus