రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. సాహో అనంతరం చిన్న బడ్జెట్ సినిమాలను కూడా చేయాలనుకున్న డార్లింగ్ ఒక ఏడాదిలో కనీసం రెండు సినిమాలను విడుదల చేయాలనీ అనుకున్నాడు. కానీ పాన్ ఇండియా హోదా వల్ల అలా జరిగేలా కనిపించడం లేదు. సినిమా మార్కెట్ ఇంటర్నెనేషనల్ లెవెల్లో పెరగడం కూడా అందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ప్రభాస్ ఎలాంటి సినిమా స్టార్ట్ చేసినా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి కనీసం రెండేళ్లు పడుతోంది.
ఇక శనివారం సెట్స్ పైకి వచ్చిన ప్రాజెక్ట్ కె కోసం అయితే నాలుగేళ్ళ సమయం పడుతోంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ కోసం వైజయంతి 500కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. గత ఏడాదిలో ఎనౌన్స్ చేసిన ఈ సినిమా 2023లో ప్రాజెక్టుల ముందుకు రావచ్చని నిర్మాత అశ్వినీ దత్ ముందే క్లారిటీ ఇచ్చారు. కానీ లేటెస్ట్ గా సెట్ చేసుకున్న ప్లాన్ ప్రకారం సినిమా 2024లోనే రావచ్చని చెబుతున్నారు.ఇక హాలీవుడ్ లో కూడా ఈ సినిమాను భారీగా రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు.
మరి దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తాడో లేదో చూడాలి. మరోవైపు ప్రభాస్ మరో నాలుగు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. మధ్యలో సిద్దార్థ్ ఆనంద్ సినిమా కూడా సెట్స్ పైకి రావచ్చని సమాచారం.
Most Recommended Video
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!