Prabhas: ఆ కామెంట్లకు ప్రభాస్ చెక్ పెడతారా?

  • April 7, 2022 / 06:52 PM IST

సినిమా రంగంలో సక్సెస్ అనేది ఎంతో కీలకమనే సంగతి తెలిసిందే. ఎంత టాలెంట్ ఉన్నా సక్సెస్ ఉన్నవాళ్లకే ఈ ఇండస్ట్రీలో ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుంది. బాహుబలి, బాహుబలి2 సినిమాల విజయాలతో దేశవిదేశాల్లో ప్రభాస్ పేరు మారుమ్రోగింది. రాజమౌళి ప్రభాస్ లోని పూర్తిస్థాయి నటుడిని వినియోగించుకుని బాహుబలి సిరీస్ ను తెరకెక్కించారని ప్రశంసలు వ్యక్తమయ్యాయి. బాహుబలి సిరీస్ సక్సెస్ వల్ల ప్రభాస్ రెమ్యునరేషన్ తో పాటు ప్రభాస్ మార్కెట్ కూడా అంచనాలకు మించి పెరిగింది.

అయితే బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన సాహో ఫ్లాప్ గా నిలిచి ఫ్యాన్స్ ను నిరాశ పరిస్తే రాధేశ్యామ్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ప్రభాస్ మళ్లీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభాస్ తన తర్వాత సినిమాలతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది. ప్రభాస్ భారీ ఇండస్ట్రీ హిట్ సాధిస్తే మాత్రమే నెగిటివ్ కామెంట్లు ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. ప్రభాస్ టాలెంట్ ఉన్న స్టార్ డైరెక్టర్లకు మాత్రమే ఛాన్స్ ఇవ్వాలని కథ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

డార్లింగ్ సినిమా నుంచి బాహుబలి2 సినిమా వరకు రెబల్ మినహా మిగిలిన అన్ని సినిమాలతో విజయాలను అందుకున్న ప్రభాస్ తర్వాత సినిమాలతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కథకు అనుగుణంగా బడ్జెట్ విషయంలో కూడా ప్రభాస్ జాగ్రత్త వహించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ మారుతి మూవీ మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ సర్జరీ వల్ల రెస్ట్ తీసుకుంటున్నారని బోగట్టా.

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్ భవిష్యత్తు సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నాయి. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమా తెరకెక్కనుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus