అభిమానులకు చిన్న కానుక అందించిన ప్రభాస్!

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పేరు చెప్పగానే అమరేంద్ర బాహుబలి రూపం అందరి కళ్ళముందు కదలాడుతోంది. సిక్స్ ప్యాక్ బాడీ, మెలితిప్పిన మీసం, పెరిగిన జుట్టుతో మహారాజుగా… ఆ లుక్ అందరి మదిలో ముద్రపడిపోయింది. ఆ లుక్ ని మరిపించడానికి ప్రభాస్ ప్రయత్నిస్తున్నారు. కొన్ని ఫోటో షూట్ నిర్వహిస్తున్నారు. వాటిలో రెండు ఫోటోలు ఈరోజు సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యాయి. ఇందులో ప్రభాస్  అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. జుట్టు కత్తిరించి, మీసాన్ని ట్రిమ్ చేశారు. ఈ లుక్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇది సాహో లుక్ అని కొంతమంది అంటున్నారు.

అయితే ఫిలిం నగర వర్గాల సమాచారం మేరకు ఇది సాహో చిత్రంలోనిది కాదని, ఓ వాణిజ్య ప్రకటనకు చెందిన స్టిల్స్ . ఈ యాడ్ త్వరలో టీవీల్లో ప్రసారం కానుంది. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో మరికొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఏకకాలంలో మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus