పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. టాలీవుడ్ డైరెక్టర్లతో పాటు బాలీవుడ్ డైరెక్టర్లు కూడా ప్రభాస్ తో సినిమా తెరకెక్కించడానికి కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సినిమాల ద్వారా కోట్ల రూపాయల పారితోషికంను సొంతం చేసుకుంటున్న ప్రభాస్ ఆ డబ్బును ఖర్చు పెట్టే విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రభాస్ పెళ్లి కోసం అభిమానులు ఎదురు చూస్తుండగా కొత్తిళ్లు కోసం ప్రభాస్ భారీ మొత్తం ఖర్చు చేశారని సమాచారం.
ఐదు భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న ప్రభాస్ నానక్ రామ్ గూడలో కొత్తిళ్లు నిర్మించుకోబోతున్నారని ఈ ఇంటి కోసం ఏకంగా 200 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది. అత్యాధునిక సౌకర్యాలు ఉండేలా ఈ ఇంటి విషయంలో ప్రభాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని బోగట్టా. పెళ్లి తర్వాత ప్రభాస్ ఈ ఇంట్లోనే సెటిల్ కానున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభాస్ కు జూబ్లీహిల్స్ లో ఒక ఖరీదైన ఇల్లు ఉంది.
అయితే అభిమానుల తాకిడి ఎక్కువగా ఉందనే కారణంతో ప్రభాస్ మరో ఇల్లుపై ఆసక్తి చూపారని సమాచారం. ఇంద్ర భవనాన్ని తలపించేలా ప్రభాస్ కొత్త ఇల్లు ఉండనుందని తెలుస్తోంది. మరోవైపు ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ 2022 సంవత్సరం జనవరి నెల 14వ తేదీన రిలీజ్ కానుంది. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ సలార్ మూవీలో నటించగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది. వచ్చే ఏడాది ప్రభాస్ నటించిన మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!