Prabhas: ‘రాజా డీలక్స్’.. ప్రభాస్ కోసం డిఫరెంట్ టైటిల్!

వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోన్న ప్రభాస్ ఇప్పుడు ఓ టాలీవుడ్ డైరెక్టర్ తో సరదాగా సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఈ సినిమా చేయడానికి ఇద్దరు పెద్ద నిర్మాతలు కూడా రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. మారుతి దర్శకత్వంలో డీవీవీ దానయ్య, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా ప్రభాస్ సినిమా చేయబోతున్నారు. నిజానికి మారుతి ఇదివరకే ప్రభాస్ ని కలిసి స్క్రిప్ట్ వినిపించారట.

ఫైనల్ స్క్రిప్ట్ నచ్చడంతో సినిమా చేద్దామని అన్నారట ప్రభాస్. ఈ సినిమా ఎక్కువరోజులు షూట్ చేయరని తెలుస్తోంది. ప్రభాస్ చాలా తక్కువ కాల్షీట్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆ టైంలో మారుతి సినిమా పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి డిఫరెంట్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ తో సినిమా తెరకెక్కుతుందట. సినిమా చాలా కలర్ ఫుల్ గా, ఫ్యామిలీ స్టోరీతో, అందమైన అమ్మాయిల కాంబినేషన్ లో ఉంటుందని తెలుస్తోంది.

ప్రభాస్ నుంచి ఫ్యామిలీ సినిమా వచ్చి చాలా కాలమవుతుంది. ఈ సినిమా ఓకే అయితే ఆ కొరత కూడా తీరిపోతుంది. ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమాలో నటిస్తున్నాడు. మరోపక్క ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తున్నారు. అలానే నాగ్ అశ్విన్ తో ‘ప్రాజెక్ట్ K’ సినిమాను మొదలుపెట్టారు. దీంతో ‘స్పిరిట్’ అనే మరో సినిమా ఓకే చేశాడు. దీన్ని సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేయబోతున్నారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus