Prabhas: ‘ఆదిపురుష్’ టీంతో ప్రభాస్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

‘బాహుబలి’ తర్వాత వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు ప్రభాస్. ఈ క్రమంలో అతని ఫిజిక్ పై కాన్సన్ట్రేషన్ పెట్టడం మర్చిపోయాడు. దీంతో ‘సాహో’ ‘రాధే శ్యామ్’ సినిమాల విషయంలో తన లుక్స్ పరంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ప్రభాస్ చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ‘ఆదిపురుష్’ కూడా ఒకటి. ఈ మూవీలో చాలా వరకు వి.ఎఫ్.ఎక్స్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి..

ప్రభాస్ ను సన్నగా చూపెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే మిగిలిన సినిమాల్లో ప్రభాస్ లుక్స్ పరిస్థితి ఏంటి అనే విషయం పై అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. మొత్తానికి ప్రభాస్ స్లిమ్ లుక్ లోకి మారిపోయాడు. అతని లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. తాజాగా ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్ ఇచ్చిన పార్టీలో మెరిశాడు ప్రభాస్. ఈ సమయంలో తీసుకున్న కొన్ని ఫోటోలు బయటకి వచ్చాయి. ఈ ఫొటోల్లో ప్రభాస్ స్లిమ్ లుక్ లో కనిపిస్తున్నాడు.

బ్లాక్ జీన్స్, మెరూన్ కలర్ షర్ట్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ ఫోటోల్లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో అతను లంకేశ్ అనే పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ కనిపించబోతున్నారు. ఈ ఫోటోలు చూసిన తర్వాత ప్రభాస్ అభిమానులు కాస్త రిలాక్స్ అయినట్టు సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తే స్పష్టమవుతుంది.

1

2

3

4

5

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus