ప్రభాస్ (Prabhas) సినిమాల జోరు చూస్తే ప్యాన్ ఇండియా లెవెల్ లో కంటిన్యూగా హైప్ పెరిగే అవకాశం ఉంది. రాజా సాబ్ (The Raja saab) , ఫౌజీ, స్పిరిట్ (Spirit) , సలార్ 2 (Salaar) , కల్కి 2 (Kalki 2898 AD)లాంటి పెద్ద ప్రాజెక్ట్ లు వరుసగా లైనప్ లో ఉన్నాయి. అందులో రాజా సాబ్ చివరి దశలో ఉండగా, హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ షూటింగ్ కూడా ఫుల్ స్పీడ్ లో సాగుతోంది. కానీ ఈ రెండు సినిమాల రన్ టైం, ప్రొడక్షన్ హడావిడి వల్ల రిలీజ్ లేటవుతుందనే టాక్ జోరుగా వినిపిస్తోంది.
ప్రస్తుతం రాజా సాబ్ కోసం ప్రభాస్ పూర్తి ఫోకస్ పెట్టగా, ఆ వెంటనే ఫౌజీ షూటింగ్ ని మరింత వేగవంతం చేసే ప్లాన్ లో ఉన్నారు. ఆ తర్వాతే స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనున్నారు. కానీ రాజా సాబ్ వాయిదా పడుతూ వస్తోందే కానీ, ఇంకా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రాలేదు. ఇదే సమయంలో ఫౌజీ కూడా వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండటం, హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయడం వల్ల నిర్మాణం తక్కువలో తక్కువ 2025 ఆఖరు వరకు సాగుతుందని తెలుస్తోంది.
దీంతో ఇప్పుడు ఫౌజీ 2026లోనే వస్తుందని టాక్ జోరుగా వినిపిస్తోంది. ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నా, షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో ఫ్యాన్స్ ఎప్పటిలానే కాస్త నిరాశగా ఉన్నారు. 2023లో సలార్ రిలీజ్ తర్వాత ఈ ఇయర్ రాజా సాబ్ తప్ప మరే సినిమా కూడా రావడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక స్పిరిట్, సలార్ 2, కల్కి 2 వంటి ప్రాజెక్ట్స్ 2026 తర్వాతే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రభాస్ సినిమాల ప్రొడక్షన్ క్వాలిటీ టాప్ లెవెల్ లో ఉండటం వల్లే ఈ ఆలస్యం జరుగుతుందన్నది మేకర్స్ వాదన. సినిమాలు లేట్ అయినా, బాక్సాఫీస్ పై రికార్డ్స్ సెట్ చేసేలా ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాబట్టి 2026లోనైనా ఫౌజీ గట్టి సక్సెస్ ఇచ్చేలా వస్తుందా లేక మళ్లీ వాయిదాలతో ప్రభాస్ అభిమానిని నిరాశపరుస్తుందా అన్నది వేచి చూడాలి.