Prabhas: ప్రభాస్‌ – మైత్రీ సినిమా విషయంలో క్లారిటీ.. ఇక పూనకాలే!

ఓ సినిమా ఉంది అని చెప్పడం ఎలా? దీనికి చాలామంది చాలా రకాలుగా సమాధానాలు చెబుతారేమో కానీ.. మైత్రీ మూవీ మేకర్స్‌ వాళ్లు మాత్రం డిఫరెంట్‌గా చెబుతారు. ఒక్క బొకెతో సినిమాను కన్ఫార్మ్‌ చేసేశారు అంటు నమ్ముతారా? అవును అది కూడా ఏదో చిన్న హీరో సినిమాకు, ఆ దర్శకుడు కూడా చిన్నవాడేమీ కాదు. ఒకరు సౌత్‌ నుండి వచ్చిన తొలి పాన్‌ ఇండియా స్టార్‌ అయితే, ఆ దర్శకుడు తీసిన సినిమా ఇప్పుడు రోజుకు సుమారు రూ. 100 కోట్లు వసూలు చేస్తోంది.

ఇప్పటికే అర్థమైపోయుంటుంది ఎవరి గురించి చెబుతున్నామో. వాళ్లే ప్రభాస్‌ – సిద్ధార్థ్‌ ఆనంద్‌. ‘పఠాన్‌’ సినిమాతో టాక్‌ ఆఫ్‌ ది ఇండియా అయిపోయారు సిద్ధార్థ్‌ ఆనంద్‌. యశ్‌ రాజ్‌ స్పై యూనివర్శ్‌లో భాగంగా వచ్చిన ఈసినిమా ఇప్పటివరకు సుమారు రూ. 700 కోట్లు వసూలు చేసింది. ఈ క్రమంలో సిద్ధార్థ్‌ ఆనంద్‌ నెక్స్ట్‌ సినిమా ఏంటి అనే చర్చ నడవాలి?. అయితే ‘ఫైటర్‌’ సినిమాతో ఇప్పటికే ఆ స్లాట్‌ ఫిక్స్‌ అయ్యింది. దీంతో ఆ తర్వాత సినిమా గురించి డిస్కషన్స్‌ నడుస్తున్నాయి.

గతంలో వచ్చిన వార్తల ప్రకారం అయితే.. ప్రభాస్‌ సినిమా అవ్వాలి. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని గతంలో చెప్పారు. కానీ ప్రభాస్‌ వరుస సినిమాలతో బిజీ అయిపోవడంతో… ఆ సినిమా ఉంటుందా? మైత్రీ మూవీ మేకర్స్‌ ఆ సినిమా చేస్తారా? అనే డౌట్స్‌ ఉండేవి. అయితే మైత్రీ నిర్మాతల్లో ఒకరైన నవీన్‌ యర్నేని ఇటీవల సిద్ధార్థ్‌ ఆనంద్‌ను కలవడంతో క్లారిటీ వచ్చేసింది. ‘పఠాన్‌’ సినిమా ఘన విజయం అందుకున్నందుకుగాను సిద్ధార్థ్‌ ఆనంద్‌ను అభినందించిన మైత్రీ నిర్మాతలు అని ఫొటోలు బయటకు వచ్చాయి.

దీంతో మైత్రి – ప్రభాస్‌ – సిద్ధార్థ్‌ ఆనంద్‌ సినిమా పక్కా అని తేలిపోయింది. అయితే ఎప్పుడు స్టార్ట్‌ చేస్తారు అనేది తెలియడం లేదు. త్వరలో సిద్ధార్థ్‌ ఆనంద్‌ – హృతిక్‌ రోషన్‌ ‘ఫైటర్‌’ మొదలవుతుంది. ఆ తర్వాతే ప్రభాస్‌ సినిమా. ఈలోపు ప్రభాస్‌ చాలా సినిమాలు చేయాల్సి ఉంది. ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’, మారుతి సినిమా, ‘స్పిరిట్‌’ అంటూ పెద్ద లిస్తే ఉంది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus