పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు భాషతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు. ప్రభాస్ సినిమాలకు అంచనాలకు మించి బిజినెస్ జరుగుతుండగా ప్రభాస్ సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్లు అంచనాలకు మించి ఉంటాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ తన చేతిలో ఏకంగా 8 నుంచి 9 సినిమాలు ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం ఈ స్థాయిలో వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న హీరో ప్రభాస్ మాత్రమే కావడం గమనార్హం.
ప్రభాస్ ఈ సినిమాలను పూర్తి చేయాలంటే కనీసం నాలుగు నుంచి ఐదు సంవత్సరాల సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది. స్టార్ డైరెక్టర్లు అయినా కొత్త డైరెక్టర్లు అయినా ప్రభాస్ తో సినిమా తీయాలంటే మాత్రం 2026 వరకు ప్రభాస్ డేట్స్ కోసం ఆగాల్సిందేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సాహో, రాధేశ్యామ్ కథల ఎంపికలో ప్రభాస్ పొరపాట్లు చేసినా ప్రభాస్ తర్వాత సినిమాలపై మాత్రం భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రభాస్ తర్వాత సినిమాలన్నీ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి. ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో బాహుబలి3 కూడా తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. సినిమాసినిమాకు రాజమౌళికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. రాజమౌళి భవిష్యత్తు సినిమాలన్నీ 400 కోట్ల రూపాయలకు అటూఇటుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నాయని సమాచారం అందుతోంది. ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో మరో సినిమా ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది.
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి బాహుబలి3 సినిమా గురించి హింట్ ఇచ్చారు. కేజీఎఫ్2 సక్సెస్ తో ప్రశాంత్ నీల్ సలార్ తో ప్రభాస్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ కాగా త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!