Prabhas: అక్కడ సత్తా చాటాలని ప్రభాస్ అలా చేస్తున్నారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ప్రభాస్ గత సినిమాలు సాహో, రాధేశ్యామ్ ఫ్లాప్ కావడంతో పాటు బుల్లితెరపై కూడా ఆశించిన స్థాయిలో రేటింగ్స్ ను సొంతం చేసుకోవడం లేదు. అయితే ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమాలలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ప్రభాస్ కు జోడీగా నటిస్తున్నారు.

అయితే తన సినిమాల బడ్జెట్, క్యాస్టింగ్ విషయంలో ప్రభాస్ అస్సలు రాజీ పడటం లేదని తెలుస్తోంది. బడ్జెట్, క్యాస్టింగ్ విషయంలో రాజీ పడితే సినిమా రిజల్ట్ పై ప్రభావం పడుతుందని ప్రభాస్ భావిస్తున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ లో ప్రభాస్ కు ఇప్పటికే చెప్పుకోదగ్గ స్థాయిలో గుర్తింపు ఉందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన భవిష్యత్తు సినిమాలు బాలీవుడ్ లో క్రేజ్, పాపులారిటీని మరింత పెంచేలా ప్రభాస్ జాగ్రత్త పడుతున్నారు.

ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకుంటుండగా సినిమాసినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా పక్కా కమర్షియల్ ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ వచ్చే ఏడాది కనీసం రెండు సినిమాలను కచ్చితంగా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

ప్రభాస్ వరుసగా సినిమాలలో నటిస్తున్నా ఆ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలు అందుకుని బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కెరీర్ విషయంలో ప్రభాస్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ప్రభాస్ కోరుకున్న సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus