Prabhas, Sujeeth: సుజీత్ కు ప్రభాస్ మరో ఛాన్స్ ఇస్తారా?

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా దర్శకునిగా మంచి పేరు తెచ్చుకుని రన్ రాజా రన్ సినిమాతో తొలి ప్రయత్నంలోనే సుజీత్ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. శర్వానంద్ హీరోగా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రెండో సినిమాకే సుజీత్ కు పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. భారీ బడ్జెట్ తో సుజీత్ సాహో సినిమాను తెరకెక్కించగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

బాలీవుడ్ లో ఈ సినిమా హిట్ రిజల్ట్ ను అందుకున్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. సాహో రిజల్ట్ వల్ల సుజీత్ కు ఛాన్స్ ఇవ్వడానికి టాలీవుడ్ స్టార్ హీరోలు ఆసక్తి చూపడం లేదు. అయితే సుజీత్ ప్రభాస్ కు కథ చెప్పారని ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని సమాచారం. ప్రభాస్ ఈ సినిమాలో సూపర్ కాప్ గా కనిపించనున్నారని తెలుస్తోంది.

లూసీఫర్ రీమేక్ కు దర్శకత్వం వహించే ఛాన్స్ మిస్ కావడంతో ప్రభాస్ తోనే మరో సినిమా తెరకెక్కించి హిట్ సాధించాలని సుజీత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సుజీత్ చెప్పిన లైన్ ప్రభాస్ కు నచ్చిందని ప్రభాస్ పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్ధం చేయాలని సుజీత్ కు సూచించారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావచ్చని తెలుస్తోంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus