Prabhas: ప్రభాస్ – మారుతి ల సినిమాకు సంబంధించిన ఆన్ లొకేషన్ పిక్ వైరల్!

ప్ర‌భాస్ – మారుతి కాంబినేష‌న్‌లో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై వివేక్ కూచిభొట్ల, విశ్వ ప్రసాద్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజానికి డీవీవీ దానయ్య ఈ ప్రాజెక్టుని నిర్మిస్తారని అంతా అనుకున్నారు. కానీ అటు చేతులు మారింది. అయితే ఇప్పటివరకు ప్రభాస్- మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రాన్ని ఇంకా అనౌన్స్ చేయలేదు నిర్మాతలు. మంచి ముహూర్తం చూసుకుని టైటిల్ పోస్టర్ తో సహా ప్రకటించాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మునుపెన్నడూ చూడని విధంగా ప్రభాస్.. ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు అని వినికిడి. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్’ అనే పేరుని పరిశీలిస్తున్నారు. అంతకు మించి ఈ ప్రాజెక్టు గురించి మరో అప్డేట్ లేదు. దర్శకుడు మారుతిని అడిగితే.. ఈ చిత్రం చాలా బాగా వస్తుంది. ఇంతకు మించి నేను ఏమీ చెప్పను అంటున్నాడు.

ఇక ప్రభాస్ (Prabhas) టీం అయితే ముందుగా ప్రభాస్ మొదలుపెట్టిన ‘ఆదిపురుష్’ ‘సలార్’ ‘ప్రాజెక్ట్ కె’ వంటి చిత్రాలు విడుదలయ్యే వరకు మారుతి ప్రాజెక్ట్ ప్రమోషన్స్ మొదలుకావు అంటున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం ఆన్ లొకేషన్ నుండి ఓ పిక్ లీక్ అయ్యి ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఈ పిక్ లో ప్రభాస్ తో పాటు ‘రాధే శ్యామ్’ ఫేమ్ రిద్దికుమార్ కూడా కనిపిస్తుంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus