Prabhas: సలార్ రిలీజ్ మరింత ఆలస్యం కానుందా?

స్టార్ హీరో ప్రభాస్ సినిమాల విషయంలో వేగం పెంచిన సంగతి తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాల షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా సలార్ మూవీ షూటింగ్ మాత్రం పూర్తి కాలేదు. తెలుస్తున్న సమాచారం ప్రకారం సలార్ మూవీ షూటింగ్ మరింత ఆలస్యం కానుంది. ప్రభాస్ ఈ సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కె, స్పిరిట్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రాజెక్ట్ కె సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తైంది.

డిసెంబర్ నెల నుంచి ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు కానుందని సమాచారం. ప్రభాస్ ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొననున్నారు. సలార్ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తి కాగా ప్రాజెక్ట్ కె సెకండ్ షెడ్యూల్ పూర్తైన తర్వాత ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొనున్నారు. 2022 సంవత్సరం డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ కె మూవీ షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. సలార్ 2022 సంవత్సరం సెకండాఫ్ లో రిలీజ్ కానుందని తెలుస్తోంది.

త్వరలో మేకర్స్ నుంచి ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి క్లారిటీ రానుంది. సలార్ రిలీజ్ డేట్ మారిన నేపథ్యంలో ప్రభాస్ ప్లాన్ మారిందని సమాచారం. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించకపోవడంతో ఏప్రిల్ లోనే సలార్ రిలీజవుతుందని బావించిన ఫ్యాన్స్ కు నిరాశ తప్పదని తెలుస్తోంది. మరోవైపు ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనుంది. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ ఇదే కావడం గమనార్హం.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus