Prabhas: ప్రాజెక్ట్ కేలో మోడ్రన్ విష్ణుమూర్తిగా ప్రభాస్.. ఫ్యాన్స్ టెన్షన్ ఇదే!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో రాముడి పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. నెగిటివ్ టాక్ తో సైతం ఈ సినిమా ఊహించని స్థాయిలో కలెక్షన్లను సాధించి నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా ఎంతగానో నచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రాజెక్ట్ కే వర్కింగ్ టైటిల్ కాగా ఈ సినిమాకు సంబంధించి మరో టైటిల్ రివీల్ అవుతుందో లేక ఇదే టైటిల్ ను సినిమాకు ఫిక్స్ చేస్తారో చూడాల్సి ఉంది.

ఈ సినిమాలో మోడ్రన్ విష్ణుమూర్తి అవతారంలో ప్రభాస్ కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. రాముని అవతారంలో చూసిన అభిమానులు విష్ణువు అవతారంలో ప్రభాస్ కనిపించనున్నారంటే ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాబట్టి ఫ్యాన్స్ టెన్షన్ తగ్గుతోంది. నాగ్ అశ్విన్ వివాదాలకు తావివ్వకుండా సినిమాను తెరకెక్కించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

600 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రాజెక్ట్ కే సినిమా నైజాం హక్కులు 80 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. ప్రాజెక్ట్ కే సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటంతో మేకర్స్ ఎంతగానో సంతోషిస్తున్నారని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ (Prabhas) తర్వాత ప్రాజెక్ట్ లతో వరుసగా ఇండస్ట్రీ హిట్లను సొంతం చేసుకుంటారని అభిమానులు భావిస్తున్నారు. సినిమా సినిమాకు ప్రభాస్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ప్రభాస్ తన సినిమాల ప్రమోషన్స్ పై సైతం ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆ సినిమాలు మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమా సినిమాకు ప్రభాస్ రేంజ్ పెరుగుతోంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus