Prabhas: ఆ విషయంలో ప్రభాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నారా?

స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి2 సినిమా తర్వాత నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. సాహో, రాధేశ్యామ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో ప్రభాస్ అభిమానులు ఫీలయ్యారు. పలు ఏరియాలలో ఈ సినిమాలు బ్రేక్ ఈవెన్ కాలేదనే సంగతి తెలిసిందే. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ టీజర్ పై నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. ఆదిపురుష్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించడం సులువైన సంగతి కాదనే విషయం తెలిసిందే.

అయితే సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ సినిమాలతో లెక్క సరి చేస్తానని ప్రభాస్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారని తెలుస్తోంది. కథల విషయంలో ప్రభాస్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా తెరకెక్కుతున్నాయి. ప్రభాస్ తర్వాత సినిమాల కోసం అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏడాదికి ఒక సినిమా కచ్చితంగా విడుదలయ్యేలా ప్రభాస్ అడుగులు వేస్తున్నారు. బాహుబలి2 సినిమాతో ప్రభాస్ మార్కెట్ పెరగడంతో ప్రభాస్ కోరుకున్న స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధపడుతున్నారు.

జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రభాస్ కు క్రేజ్ పెరుగుతోంది. ప్రభాస్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ లను పూర్తి చేసిన తర్వాతే కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం. ప్రభాస్ పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడంతో పాటు యంగ్ జనరేషన్ డైరెక్షన్లకు ఛాన్స్ ఇస్తున్నారు.

కొత్త తరహా కథాంశాలకు ప్రభాస్ ఓకే చెబుతున్నారు. ప్రభాస్ టాలీవుడ్ డైరెక్టర్లతో పాటు ఇతర ఇండస్ట్రీల స్టార్ డైరెక్టర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండటం గమనార్హం. ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంటుంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus