Prabhas: మిక్కీ జె మేయర్ ప్లేస్ లో కోలీవుడ్ టెక్నీషియన్!

ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగశ్విన్ ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి ‘ప్రాజెక్ట్ K’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నారు. ఈ సినిమాకి ముందుగా మిక్కీ జె మేయర్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా వచ్చింది. కానీ ఇప్పుడు మిక్కీ స్థానంలో కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళంలో ‘కబాలి’, ‘కాలా’, ‘జిగర్తాండ’ లాంటి సినిమాలకు సంగీతం అందించిన సంతోష్ నారాయణన్ ను ‘ప్రాజెక్ట్ K’ కోసం తీసుకుంటున్నారట.

సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ప్రచారం ఓ రేంజ్ లో జరుగుతోంది. నిజంగానే మిక్కీ జె మేయర్ ను తప్పిస్తున్నారా..? లేక సంతోష్ నారాయణన్ ను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తీసుకున్నారా అనే విషయంలో క్లారిటీ లేదు. మరి దీనిపై చిత్రబృందం స్పందిస్తుందేమో చూడాలి. మొన్నామధ్య ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి అమితాబ్ బచ్చన్ మీద కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మరికొన్ని రోజుల్లో ప్రభాస్ ఈ సినిమా సెట్స్ పైకి రానున్నారు.

ఈ ఒక్క సినిమా కోసం ప్రభాస్ రెండు వందల రోజుల కాల్షీట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా దీపికా పదుకోన్ ను ఎంపిక చేసుకున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus