Prabhas:‘బాహుబలి’ని గుర్తు చేస్తున్న నాగ్‌ అశ్విన్‌!

‘బాహుబలి’ అనగానే గుర్తొచ్చే పేర్లలో రామోజీ ఫిల్మ్‌ సిటీ కూడా ఒకటి. సినిమా ప్రధానమైన సీన్స్ అన్నీ అక్కడే తెరకెక్కించారు. దాని కోసం అక్కడ ఏకంగా రెండు చిన్నపాటి రాజ్యాలనే సృష్టించారు కూడా. ‘బాహుబలి’ సెట్‌ ఇప్పటికీ అక్కడే ఉంది. దానిని విజిటింగ్‌ ప్లేస్‌గా వాడుకుంటోంది రామోజీ ఫిల్మ్‌ సిటీ యాజమాన్యం. ఇప్పుడు ఈ సీన్స్‌ మళ్లీ రిపీట్‌ అవుతున్నాయా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ కాంబోలో వైజయంతి మూవీస్‌ పతాకంపై ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌) తెరకెక్కుతోంది.

ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ (ట్రయల్‌ షూట్‌) రామోజీ ఫిల్మ్‌ సిటీలో మొదలైంది. త్వరలో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తారు. అయితే సినిమా 90 శాతం చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌ సిటీలోనే జరగబోతోంది అనేది తాజా సమాచారం. షూటింగ్‌కు కావాల్సిన సదుపాయాలు, వసతి, విడిది, ప్రైవసీ… ఇలా అన్నీ ఉండటంతో నిర్మాత అశ్వనీదత్‌ ఆర్‌ఎఫ్‌సీకే ఓటేశారట. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఉండే రెండు ప్రధాన హోటళ్లు సితార, తారలో ‘ప్రాజెక్ట్‌ కె’ టీమే ఉన్నారట.

ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌ అందులోనే ఉన్నారు. త్వరలో కథానాయిక దీపికా పదుకొణె కూడా వచ్చి కలుస్తుందట. వీలైనంత త్వరగా షూటింగ్‌ అవ్వాలన్నా, ఇబ్బంది ఉండకూడదన్నా ఆర్‌ఎఫ్‌సీ బెటర్‌ అని నిర్ణయించినట్లున్నారు. అలాగే ఈనాడు, ఈటీవీ ప్రచారం కలిసొస్తుంది కూడా. ఆర్‌ఎఫ్‌సీలో చిత్రీకరించే ‘పెద్ద’ సినిమాలకు ప్రచారం ఎలాగూ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాలా.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus