Prabhas: రాజమౌలి ప్రభాస్ ను ఆ విషయంలో అంతలా ఇబ్బంది పెట్టారా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు. ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించినటువంటి మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం బాహుబలి. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ప్రభాస్ కి పాన్ ఇండియా స్టార్ అనే గుర్తింపు కూడా తీసుకువచ్చింది.

ఈ సినిమా తర్వాత ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇలా ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ రాజమౌళి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాహుబలి సినిమాలో ప్రభాస్ రాజమౌళికి ఒక కండిషన్ పెట్టారట ఈ కండిషన్ కి ఒప్పుకుంటేనే నేను సినిమాలో నటిస్తానని చెప్పారట.

బాహుబలి సినిమా కోసం ప్రభాస్ రాజమౌళికి ఎలాంటి కండిషన్ పెట్టారు అనే విషయానికి వస్తే బాహుబలి పార్ట్ వన్ సినిమా చేసే సమయంలో రాజమౌళి ప్రభాస్ కి ఫుడ్ విషయంలో చాలా కండిషన్స్ పెట్టారట. ప్రభాస్ కేమో ఫుడ్ తీసుకోవడం చాలా అలవాటు కానీ రాజమౌళి మాత్రం ప్రత్యేకంగా ఒక వెజిటేరియన్ డైటీషియన్ ను నియమించి ఆయనని భారీగా డైట్ మెయింటెన్ చేసేలా ఇబ్బంది పెట్టారట. ఇలా బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ ఎంతో ఇబ్బంది పడటంతో

బాహుబలి 2 సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ రాజమౌళి తో మాట్లాడుతూ నేను ఈ సినిమాలో నటించాలి అంటే మీరు నేను పెట్టే కండిషన్ కి ఒప్పుకుంటేనే నటిస్తాను లేకపోతే ఈ సినిమా చేయనని చెప్పారట మరి ప్రభాస్ ఎలాంటి కండిషన్ పెట్టారు అనే విషయాన్ని వస్తే…నేను మీ సినిమా షూటింగ్ చేసే సమయంలో మాత్రమే మీరు చెప్పిన విధంగా డైట్ ఫాలో అవుతాను షూటింగ్ లేని సమయంలో నాకు ఇష్టమైనటువంటి ఫుడ్ తీసుకుంటాను జక్కన్న ఇందుకు పర్మిషన్ ఇవ్వు ఇలా అయితేనే నేను ఈ సినిమాలో నటిస్తాను అని చెప్పడంతో ప్రభాస్ పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి రాజమౌళి ఆ కండిషన్ కి ఒప్పుకున్నారట.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus