Prabhas: ‘రాధే శ్యామ్’ మూవీ నాన్ స్టాప్ ప్రమోషన్లకు ముహూర్తం ఫిక్స్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం.. తెలుగుతో పాటు హిందీ,తమిళ, మలయాళ భాషల్లో ఏక కాలంలో విడుదల కాబోతుంది. మిథున్, మనన్ భరద్వాజ్, జస్టిన్ ప్రభాకరన్ వంటి వారు ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.హిందీ వెర్షన్ కు మిథున్, మనన్ భరద్వాజ్ లు సంగీతం అందిస్తుండగా..

తెలుగులో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. ‘యూవీ క్రియేషన్స్’ ‘గోపీకృష్ణ మూవీస్’ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.పీరియాడిక్ ప్రేమ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్… విక్రమాదిత్య పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే శ్యామ్ లేదా క్రిష్ అనే మరో పాత్రలో కూడా ప్రభాస్ కనిపించబోతున్నారు అని టాక్ వచ్చింది.. కానీ దాని గురించి చిత్ర యూనిట్ సభ్యులు ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రాన్ని జూలై 30న విడుదల చేయబోతున్నట్టు దర్శకనిర్మాతలు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి సంబంధించి ఇంకా 8 రోజుల షూటింగ్ వర్క్ బ్యాలెన్స్ ఉందట. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయిపోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కరోనా ఉధృతి తగ్గి, ఫస్ట్ కాపీ రెడీ అయిన వెంటనే ప్రమోషన్స్ మొదలుపెట్టాలని ‘రాధే శ్యామ్’ యూనిట్ భావిస్తోంది.కచ్చితంగా ఈ చిత్రం ఘన విజయాన్ని సాధిస్తుంది అని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus