ప్రత్యేక విమానంలో యూరప్ కి ప్రభాస్, పూజా హెగ్డే..!

ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ రాధే శ్యామ్. దర్శకుడు రాధా కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా కొద్దిరోజుల క్రితం సెప్టెంబర్ రెండవ వారం నుండి రాధే శ్యామ్ షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నట్లు ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆరు కోట్ల ఖర్చుతో ఓ హాస్పిటల్ సెట్ వేశారని, అందులో ప్రభాస్ పూజ హెడ్గేలపై కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు చిత్రీకరిస్తారని వార్తలు రావడం జరిగింది. ఐతే తాజా వార్త ప్రకారం రాధే శ్యామ్ చిత్ర యూనిట్ షూటింగ్ కోసం యూరప్ వెళ్లనున్నారట.

యూరప్ లో కొన్ని ప్రదేశాలలో కీలక సన్నివేశాలు మరియు పాటల చిత్రీకరణ జరపనున్నారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. రాధే శ్యామ్ మూవీ కథ రీత్యా ప్రధాన భాగంగా ఇటలీ దేశంలో సాగుతుంది. ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసమే టీమ్ సభ్యులు యూరప్ వెళుతున్నారని వినికిడి. దీని కోసం చిత్ర యూనిట్ ఓ స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేశారని సమాచారం. ప్రభాస్ నుండి చాలా కాలం తరువాత వస్తున్న లవ్ ఎంటర్టైనర్ గా రాధే శ్యామ్ ఉంది.

యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది రాధే శ్యామ్ విడుదల కానుంది. మరో వైపు ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీతో పాటు దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించనున్న ఆదిపురుష్ మూవీలలో కూడా నటించాల్సి ఉంది.

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus