పురాణాల్లో పుష్పక విమానం గురించి ప్రముఖంగా చెప్పుకొంటాం. ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి స్థానం ఉండడం ఆ విమానం ప్రత్యేకత. ఇప్పుడు ప్రభాస్ సినిమాల పరిస్థితి కూడా అలానే తయారయ్యింది. ప్రభాస్ సంపాదించుకున్న పాన్ ఇండియన్ స్టార్ స్టేటస్ అతనికి ఒకరకంగా మైనస్ అయిపొయింది. అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి సినిమాలో పలు భాషలకు చెందిన నటీనటుల్ని ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. సదరు భాషల మార్కెట్ కోసం తప్పని పరిస్థితి ఇది.
ఇప్పుడు “రాధేశ్యామ్” పరిస్థితి కూడా అలానే తయారయ్యింది. ఆల్రెడీ సినిమాలో పలు భాషా నటులు ఉండగా.. ఇప్పుడు కొత్తగా మలయాళ నటుడు జయరాంను తెచ్చిపెట్టారు. జయరాం వచ్చి క్యాస్ట్ లో జాయిన్ అవ్వడం పెద్ద సమస్య కాదు. ఎప్పుడో రెండేళ్ల క్రితం పూజా కార్యక్రమాలతో మొదలైన చిత్రం, షూటింగ్ ఆల్రెడీ 60% పూర్తి చేసుకొన్న చిత్రంలో ఇప్పుడు కొత్తగా మరో నటుడు అది కూడా కీలకపాత్ర పోషించే నటుడు జాయిన్ అవ్వడం అనేది చర్చనీయాంశం.
దాంతో ఇప్పుడు షూటింగ్ ఎంతవరకు అయ్యింది? ఇంకా ఎంత పార్ట్ మిగిలి ఉంది అనే విషయమై డౌట్ లు మొదలయ్యాయి. 2021లో ఈ సినిమా రిలీజ్ అని ఎనౌన్స్ చేసిన ప్రభాస్.. నాగ్ అశ్విన్ తో ఒక సినిమా మరియు ఆది పురుష్ అనే మరో భారీ చిత్రాన్ని కూడా ఎనౌన్స్ చేసాడు. మరి అతడి ప్రాజెక్ట్స్ అన్నీ ఇలా నత్తనడక నడుస్తుంటే.. విడుదల విషయంలో ఒకటికిరెండుసార్లు మార్పులు రావడం అనేది సర్వసాధారణం అయిపోతుంది.
Most Recommended Video
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?