షారూఖ్ సినిమాలో ప్రభాస్, రజనీకాంత్
- August 11, 2017 / 11:11 AM ISTByFilmy Focus
బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇండియన్ స్టార్ అయ్యారు. అతనితో సినిమాని నిర్మించాలని కొంతమంది ప్రయత్నిస్తుంటే మరికొంతమంది మాత్రం తన సినిమాలో కాసేపు కనిపించినా చాలని భావిస్తున్నారు. అందుకే నిర్మాతలు సంప్రదింపులు చేస్తున్నారు. అలా ప్రయత్నిస్తున్న జాబితాలోకి షారూఖ్ ఖాన్ చేరారు. బాద్ షా హీరో కదా? నిర్మాతల జాబితాలోకి ఎందుకు వచ్చారు? అదే కదా మీ ప్రశ్న.. అక్కడికే వస్తున్నాం. షారుక్ ఖాన్ హీరోగా నటిస్తూ ఓ చిత్రాన్ని ఏకకాలంలో మూడు భాషల్లో రెడ్ ఛిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ సినిమా పతాకంపై నిర్మించాలని అనుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీకి శిద్యాత్ అనే టైటిల్ ఖరారు చేశారు.
ఈ మూవీ బిజినెస్ బాగుండాలని ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లను తీసుకునేందుకు షారూక్ చూస్తున్నారు. రజనీకాంత్ షారుక్ సినిమాలో ఓసారి కనిపించారు. ప్రభాస్ యాక్షన్ జాక్సన్ సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. సో వీరిద్దరితో పాటు అమితాబ్.. షారుక్ సినిమాలో నటించడానికి ఒకే చెబుతారని బాలీవుడ్ మీడియా కథనాలను ప్రచురిస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















