Prabhas: ఆ రికార్డును అందుకున్న రెబల్ స్టార్!

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం తెలుగులో ఏ హీరో లేనంత బిజీగా ఉన్నారు. ఒకే సమయంలో వేర్వేరు సినిమాలకు డేట్లు కేటాయిస్తూ ప్రభాస్ వచ్చే ఏడాది ఏకంగా మూడు సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఏకంగా 7 మిలియన్ల ఫాలోవర్లను ప్రభాస్ సంపాదించుకున్నారు. ప్రభాస్ కు ప్రేక్షకుల్లో క్రేజ్ భారీస్థాయిలో ఉండటంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

ప్రభాస్ కు క్రేజ్, ఫాలోవర్స్ సంఖ్య పెరగడంపై ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు హిట్ అయితే మాత్రం ప్రభాస్ సినిమాల బడ్జెట్ పెరిగే అవకాశం ఉంది. పాన్ ఇండియా సినిమాలను డీల్ చేయగల టాలెంట్ ఉన్న డైరెక్టర్లకు మాత్రమే ప్రభాస్ తన సినిమాలకు డైరెక్షన్ చేసే ఛాన్స్ ఇస్తున్నారు. ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి ఉంది.

ప్రభాస్ 25వ సినిమా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. బాలీవుడ్ లో సైతం ప్రభాస్ కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus