సాహో లో కథని మలుపు తిప్పే పాత్రలు ఎన్ని అంటే ?

  • June 20, 2018 / 12:59 PM IST

బలమైన పాత్ర ఉంటే కథ ఆసక్తికరంగా ఉంటుంది. అటువంటి పాత్రలు మరిన్ని ఉంటే కథ ఇచ్చే మజానే వేరే. ఆ విషయాన్నీ బాహుబలి చిత్రం ద్వారా రాజమౌళి ప్రతి ఒక్కరికీ అర్ధమయ్యే రీతిలో వివరించారు. అందులో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి, భల్లాల దేవ పాత్రలు మాత్రమే కాదు.. శివగామి, కట్టప్ప, దేవసేన, అవంతిక, బిజ్జల దేవ వంటి దాదాపు పది పాత్రలను అత్యంత శక్తివంతంగా చూపించారు. అందుకే ప్రతి సీన్ రసవత్తరంగా ఉంటుంది. అదే ఫార్ములాని ప్రభాస్ లేటెస్ట్ చిత్రానికి సుజీత్ ఫాలో అవుతున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు టీ సిరీస్ తో కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ అబుదాబిలో భారీ షెడ్యూల్ జరుపుకుంది. 70 కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ యాక్షన్ సన్నివేశం సినిమాలో కీలకం కానుంది. సన్నివేశాలు మాత్రమే కాదు ..

ఇందులో కీలకమైన పాత్రలు పదకొండు ఉన్నాయని ప్రభాస్ స్పష్టం చేశారు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సాహోలో తనతో పాటు సమానంగా పదిమంది క్యారెక్టర్స్ బలంగా ఉంటాయని వెల్లడించారు. “ఈ సినిమాలో శ్రద్ధా కపూర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కథని ముందుకు తీసుకెళ్లే పాత్ర ఆమెది. అలాగే నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే, జాకీష్రాఫ్, మహేష్ మంజ్రేకర్, మందిర బేడీ, ఎవ్లిన్‌ శర్మ, టిన్ను ఆనంద్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు తమిళనటుడు అరుణ్ విజయ్, మల్లూవుడ్ సీనియర్ నటుడు”లాల్” కూడా సాహోలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. బాహుబలిని ఇష్టపడినవారందరికీ సాహో కూడా కచ్చితంగా నచ్చుతుంది” అని ప్రభాస్ ధీమాగా చెప్పారు. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus