వాయిదా పడిన ప్రభాస్ సాహో… నిజం ఎంత?

టాలీవుడ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మరో నెలలో ప్రేక్షకుల ముందుకి రానుంది. అదేనండీ మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘సాహో’ చిత్రం. ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 15 న విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ మొత్తం శరవేగంగా పనిచేస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబందించిన ఓ వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది.

వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన రూమర్స్ ప్రకారం.. ‘సాహో’ ఆగస్టు 30న విడుదల చేయాలని నిర్ణయించారట. ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తయింది, పోస్ట్ ప్రొడక్షన్ పని కూడా పెండింగులో ఉంది. చివరి నిమిషయంలో అనవసర టెన్షన్స్ పడకుండా స్మూత్‌గా సినిమా రిలీజ్ చేద్దామనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

‘సాహో’ మూవీ నాలుగు భాషల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ‘సాహో’ విడుదల వాయిదా గురించి నిర్మాతల నుంచి ఎలాంటి అఫీషియల్ సమాచారం లేదు. మరి ఇందులో నిజం ఎంత? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఒక వేళ ఇదే నిజమైతే ఆగస్టు 15న విడుదల కాబోతున్న ‘మిషన్ మంగళ్’, ‘బాట్లా హౌస్’ నిర్మాతలు సంతోష పడటం ఖాయం. ఈ చిత్రంలోని కీలకమైన ‘చేజ్‌ సీన్‌’ ను అబుదాబిలో భారీ రేంజ్లో చిత్రీకరించారు. సినిమాలో దాదాపు 8 నిమిషాల నిడివి ఉన్న ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏకంగా 70 కోట్లు ఖర్చు చేశారట. హాలీవుడ్‌ యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus