మల్టీ లాంగ్వేజస్ లో విడుదల చేస్తే ఇదే తలనొప్పి..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘సాహో’. 350 కోట్ల భారీ బడ్జెట్ తో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం కోసం ఇండియా వైడ్ ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక మరికొద్ది గంటల్లోనే విడుదల కాబోతుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లు సినిమా పై అంచనాల్ని అమాంతం పెంచేశాయి. పాటలకి మొదట్లో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ప్రోమోస్ విడుదల చేసాక టాక్ బెటర్ అయ్యింది. ఇదిలా ఉండగా ఇప్పుడు ‘సాహో’ కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్లు మొదలయ్యాయి. అయితే మల్టీ లాంగ్వేజస్ లో విడుదల చేయడం వలనే ఇలా లీకులు తలనొప్పి ఏర్పడుతుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఇక వారి కథనాలు ప్రకారం ఈ చిత్రం 2 వేల కోట్ల దొంగతనం చుట్టూ తిరుగుతుందట. ఆ దొంగతనం ఎవరు చేశారనేది పోలీసులకు ఓ మిస్టరీగా మారుతుంది. దీంతో ఈ కేసును టేక్ అప్ చేయడానికి అశోకా చక్రవర్తి(ప్రభాస్) ని సీన్లోకి ఎంట్రీ ఇస్తారట. ఇక ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ దొంగతనం చేసేది కూడా ప్రభాసేనట. ఓ పోలీస్ ఆఫీసర్ ఎందుకు అన్ని వేల కోట్లు దొంగతనం చేయాల్సి వచ్చిందనేది ఫ్లాష్‌బ్యాక్‌లో దర్శకుడు చాలా కన్విన్సింగ్‌గా చెప్పాడని తెలుస్తుంది. ఇక హీరోని మొదట్లో అపార్ధం చేసుకున్న హీరోయిన్ ఆ తర్వాత.. ప్రేమిస్తుందట. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ తండ్రి ఓ శాస్త్రవేత్త.. ఒక అధునాతన జెట్‌ ప్యాక్‌ను సృష్టిస్తాడట. దానికి సంబంధించిన రహస్యాలు ఓ బ్లాక్ బాక్స్‌లో ఉంటాయట. అసలు ఆ బ్లాక్ బాక్స్‌కు.. రెండు వేల కోట్ల దొంగతనానికి సంబంధం ఏంటి? ప్రభాస్ డబుల్ రోలా లేక రెండు షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడా? అనేది మిగిలిన కథని తెలుస్తుంది. ఈ కథ నిజమో కాదో … మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus