ప్రభాస్ ఫ్యాన్స్ ఆ సీన్ కి విజిల్స్ వేయడం ఖాయమంట.. !

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న చిత్రం ‘సాహూ’. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో రోబరీ సీన్ ఒకటి ఉండబోతుందట. ఈ సీన్ ఈ చిత్రానికే హైలైట్ గా నిలుస్తుందని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఈ రోబరీ సీన్… ఒక నగల షాపును కొల్లగొట్టేందుకు హీరో స్కెచ్ వేస్తాడు. తన ప్రమేయం లేకుండానే నగలన్నీ వచ్చి తన కారులో పడేలా తెలివిగా హీరో చేసిన ప్లాన్ చూసితీరవలసిందేనని చెప్పుకొస్తున్నారు.

బాలీవుడ్ ‘ధూమ్’ సిరీస్ లోని చోరీ సీన్స్ కి మించి ఈ ఎపిసోడ్ ను చిత్రీకరించబోతున్నారంట. ఈ ఎపిసోడ్ కోసం ప్రత్యేకంగా… రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన షాపింగ్ మాల్ సెట్లో ఈ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నారట. ఈ సీన్ కు ప్రభాస్ అభిమానులు విజిల్స్ వేయడం ఖాయమని చెబుతున్నారు. ఇక యూరప్ లో చేయాలనుకున్న షెడ్యూల్ ను కూడా, ఫిల్మ్ సిటీలోనే సెట్స్ వేసి చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు 15 న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus