Salaar: ప్రభాస్ సలార్ షర్ట్ ఖరీదెంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరుగుతుండగా సలార్ మూవీ ప్రమోషన్స్ మొదలవుతున్నాయి. సలార్ మూవీ ట్రైలర్ ను థియేటర్స్ లో కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో కొన్ని పెద్ద సినిమాలకు ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యారు. సలార్ ట్రైలర్ యూట్యూబ్ లో రిలీజ్ కావడానికి ముందే థియేటర్లలో రిలీజ్ కానుందని భోగట్టా. మేకర్స్ నుంచి ఇందుకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

మరోవైపు సలార్ టీ షర్ట్ లు మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఆన్ లైన్ ద్వారా ఈ టీ షర్ట్ లను విక్రయిస్తున్నారు. హోంబలే వెర్సెస్ వెబ్ సైట్ ద్వారా ఈ టీ షర్ట్ లను విక్రయిస్తుండటం గమనార్హం. https://www.hombaleverse.com/ వెబ్ సైట్ ద్వారా టీ షర్ట్ లను సులభంగా కొనుగోలు చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఈ టీ షర్టుల ధర 499 రూపాయల నుంచి 1499 రూపాయల వరకు ఉండనుందని సమాచారం అందుతోంది. సలార్ టీ షర్ట్, హూడీ, హార్మ్ స్లీవ్ లను ఈ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. టీ షర్ట్ ల ధరలు ఎక్కువగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రాబోయే రోజుల్లో టీ షర్ట్ ల ధరలను తగ్గించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

సలార్ (Salaar) మూవీ 10,000కు పైగా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. సలార్ సినిమాకు ఇతర భాషల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. ప్రభాస్ సినిమా ఏ రేంజ్ లో ఉండనుందో చూడాల్సి ఉంది. ప్రభాస్ కు ఇకపై వరుస విజయాలు దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus