Prabhas: తన పెళ్లి గురించి తానే సెటైర్లు వేసుకుంటున్న ప్రభాస్‌.. ‘బుజ్జి’ ఈవెంట్‌లో కూడా…

  • May 23, 2024 / 02:40 PM IST

‘బుజ్జికి స్వాగతం పలుకుదాం’ అంటూ కొన్ని రోజుల క్రితం ప్రభాస్‌ (Prabhas) ఓ పోస్ట్‌ పెట్టాడు గుర్తుందా? తొలుత జీవిత భాగస్వామి గురించే ఇదంతా అని అందరూ అనుకున్నా వెంటనే ఇదంతా సినిమా గురించి చేస్తున్న స్టంట్‌ అని తెలిసిపోయింది. అయితే ఈ క్రమంలో ఓ చిన్నపాటి విమర్శలు కూడా వచ్చాయి. ప్రభాస్‌ తన పెళ్లి గురించి తనే సెటైర్లు వేసుకుంటున్నాడు అని కొందరు అంటే.. మరికొందరేమో సినిమా ప్రచారానికి పెళ్లిని వాడేశారు అని అన్నారు.

తాజాగా, ఈ చర్చ మరోసారి మొదలైంది. మొదటిసారి లాగే ఈ సారి కూడా ప్రభాసే దీనికి కారణం. ఈ సినిమాలో కీలక పాత్రధారి అయిన బుజ్జి (కారు)ను చూపించడానికి ఓ ఈవెంట్‌లో పెట్టారు బుధవారం. ఆ ఈవెంట్‌ ఆఖరులో ప్రభాస్‌ మాట్లాడుతూ ‘కల్కి’ (Kalki 2898 AD)  ఈవెంట్‌కి స్పెషల్ హోస్ట్ వస్తున్నారని నిర్మాతలు పెట్టిన పోస్ట్‌ గురించి ప్రభాస్‌ సరదాగా సమాధానం ఇచ్చాడు.

ప్రొడక్షన్‌ హౌస్‌ పెట్టిన ఆ పోస్ట్ వల్ల అమ్మాయిల హార్ట్స్ బ్రేక్ అయ్యాయని, వాళ్ల కోసమే తాను పెళ్లి చేసుకోలేదని అన్నాడు ప్రభాస్‌. ఇక ఈ లెక్కన తన పెళ్లి ఇప్పట్లో లేదని క్లారిటీ ఇచ్చినట్లు అయింది. ప్రభాస్‌ లైనప్‌ చూస్తే.. ఇప్పట్లో ఆయనకు ఖాళీ కూడా దొరికే అవకాశం లేదు. సినిమా సినిమాకు గ్యాప్‌ ఏమాత్రం దొరకడం లేదు. అయితే ఫ్యాన్స్‌ మాత్రం ‘పెళ్లి చేసుకోవచ్చుగా డార్లింగ్‌’ అని అంటున్నారు.

ప్రభాస్‌ సినిమాల సంగతి చూస్తే.. ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఆ తర్వాత ప్రశాంత్‌ నీల్ (Prashanth Neel)  ‘సలార్‌ 2’ (Salaar) తెరకెక్కాల్సి ఉంది. ఇది కాకుండా మారుతి (Maruthi Dasari) దర్శకత్వంలో ‘రాజా సాబ్‌’ (The Rajasaab) అనే సినిమా చేయాల్సి ఉంది. వీటితోపాటు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ‘స్పిరిట్‌’ (Spirit) మొదలుపెట్టాలి. ఇది ఈ ఏడాది ఆఖరులో ఉంటుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా ఉంది అంటున్నారు. అయితే ఇంకా ప్రకటన రాలేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus